ప్రస్తుతం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు సంచలనం సృష్టిస్తుంది. అందరి చూపు ఈ కేసుపైనే ఉంది. ఈ కేసు రోజుకో మలుపు తీసుకోవడంతో రోజు రోజు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠభరిత నెలకొంది. సీబీఐ కేసుని విచారిస్తోంది. ఎన్‌సీబీ రియాని అరెస్ట్ చేసి విచారిస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో సుశాంత్‌ ప్రియురాలు రియా ఉన్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సుశాంత్‌, రియాల సరదా వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. వైరల్‌గా మారింది. ఇందులో సుశాంత్‌ బెడ్‌పై పడుకుని `లోడెడ్‌` అనే పుస్తకం చదువుతుండగా, రియా(వీడియోలో కనిపించడం లేదు) అతన్ని ప్రశ్నిస్తుండగా, సుశాంత్‌ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ సమాధానం చెబుతున్నాడు. 

ఈ వీడియోని రియా తీస్తుంది. వీడియో చిత్రీకరణ టైమ్‌లో సుశాంత్‌ మత్తుల్లో ఉన్నట్టు ఆయన ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతుంది. మరో వీడియోలో ఓ  వ్యక్తి పక్క నుంచి మెడిసన్ తీసుకున్నావా? లేదా? అని అడగ్గా, సుశాంత్ హ్యాండ్‌సమ్, క్యూట్‌గా ఉన్నాడని రియా కాంప్లిమెంట్ ఇవ్వడం గమనార్హం. ఓ మీడియా సంస్థ దీన్ని సేకరించి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం దీన్ని సుశాంత్‌ అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. 

సుశాంత్‌ జూన్‌ 14న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయనది ఆత్మహత్యా? హత్యా అనే కోణంలో సీబీఐ విచారిస్తోంది. డ్రగ్స్ మాఫియా కేసులో ఎన్‌సీబీ విచారిస్తోంది. మొత్తంగా ఈ కేసు రియా మెడకు చుట్టుకుంటోంది.