బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి 2 నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన మృతికి సంబంధిచిన కేసు విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ముందుగా ఆత్మహత్యే అని భావించి అందుకు బాలీవుడ్ మాఫియానే కారణం అని ఆరోపించారు. తరువాత కేసు పూర్తిగా రియా చక్రవర్తి వైపు మళ్లింది. ఆమె ఆర్ధికంగా, మానసికంగా వేదించటం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సుశాంత్ దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తులు కూడా రియా మీదే ఆరోపణలు చేయటంతో కేసు పూర్తిగా రియా వైపే తిరగింది. అయితే ఈ విషయంలో ముంబై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన సుశాంత్ ఫ్యామిలీ సీబీఐ ఎంక్వైరీ కావాలంటూ డిమాండ చేస్తున్నారు. ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లటంతో సుప్రీం తీర్పునిచ్చింది. 

సుశాంత్ కేసును సీబీఐతో ఎంక్వైరీ చేయించాలంటూ ఆదేశించింది సుప్రీం. ఈ ఆదేశాలపై సుశాంత్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. `దేశ అత్యున్నత వ్యవస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఈ పోరాటంలో తమకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు` అంటూ ఓ స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేశారు సుశాంత్ కుటుంబ సభ్యులు.