నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన‌ 'సూర్యకాంతం' నిన్న శుక్ర‌వారం విడుదలయింది.  ఈ సినిమాతో పాటే రిలీజైన లక్ష్మీస్ ఎన్టీఆర్ కలెక్షన్స్ విషయంలో స్పీడుగా దూసుకుపోతూంటే...సూర్యకాంతం మాత్రం స్టక్ అయ్యిపోయింది.  ఓవర్ సీస్ లో మంచి పేరున్న  డిస్ట్రిబ్యూటర్లు నిర్వాణ సంస్థ నిర్మాణ రంగంలోకి దిగి, నిర్మించిన సినిమా ఇది కావటంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై మంచి ఆశలే పెట్టుకున్నారు. 

ఈ నిర్మాతలు  నిర్మించిన తొలి చిత్రం మను సినిమా డిజాస్టర్. ఆ సినిమాని మించిపోయింది మిస్ సూర్యకాంతం. ట్రేడ్ లో చెప్పుకునేదాని ప్రకారం ఈ  సినిమాకు బిజినెస్ పెద్దగా జరగలేదు. దిల్ రాజు తీసుకుని రిలీజ్ చేసారు. దాదాపు అందరూ క్యూబ్ ఖర్చులు పెట్టుకుని మరీ ఓన్ రిలీజ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఓపినింగ్స్ రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా..మరో ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

మరో ప్రక్క ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నిర్వాణ సంస్ధ చాలా ఆశలు పెట్టుకుందట. ఈ సినిమా హిట్ అయితే వచ్చే డబ్బులతో  మహర్షి సినిమా ఓవర్ సీస్ రైట్స్ కొనాలనుకున్నారట నిర్వాణ నిర్వాహకులు. అయితే సూర్య కాంతం దెబ్బ కొట్టేసింది. దాంతో మహర్షి పై పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని కూడా ప్రక్కన పెట్టేసిందిట సంస్ద.