కోలీవుడ్ లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు సూర్య తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రజినీకాంత్, కమల్ హాసన్ ల తరువాత తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న తమిళ హీరోగా సూర్యకి పేరుంది.

ఒకప్పుడు ఇరవై కోట్లు ఉండే అతడి మార్కెట్ ఇప్పుడు బాగా పడిపోయింది. వరుస ఫ్లాప్ లు అతడిని వెంటాడడంతో మార్కెట్ బాగా దెబ్బతింది. తాజాగా ఆయన నటించిన 'ఎన్ జి కె' సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకుడు సెల్వ రాఘవన్ కి మంచి పేరు ఉండడం, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరికి ఇక్కడ పాపులారిటీ ఉండడంతో ఈ సినిమాకి క్రేజ్ వస్తుందని భావించారు. కానీ ఈ సినిమాకు జరుగుతోన్న బుకింగ్స్ చూస్తుంటే ఈ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రావేమోననే సందేహాలు కలుగుతున్నాయి.

కాబట్టి సినిమాకు వచ్చే టాక్ పై ఆధారాపడాల్సిన పరిస్థితి కలుగుతోంది. మొదటి ఆటకి మంచి స్పందన గనుక వస్తే సినిమా పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా ప్రీరిలీజ్ క్రేజ్ ని బట్టి తెలుగులో సూర్యకి అంత సీన్ లేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.