ధైర్యం, ధర్మం రెండూ వుంటే భయమెందుకు.. సూర్య "గ్యాంగ్" టీజర్

First Published 14, Dec 2017, 1:26 AM IST
surya gang teaser released
Highlights
  • సూర్య హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం తానా సెరెంద కూట్టం
  • ఈ మూవీని తెలుగులో గ్యాంగ్ పేరుతో రిలీజ్ చేస్తున్న యువీ క్రియేషన్స్
  • మూవీలో సమాజం,జనాన్ని జాగృపరిచే డైలాగులతో అదరగొట్టిన సూర్య
  • ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ

తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో వున్న ఫాలోయింగే వేరు. గజినీ, ఆరు, 24, రక్త చరిత్ర, సెవెంత్ సెన్స్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సూర్య. తాజాగా సూర్య నటించిన ‘తానా సెరెంద కూట్టమ్‌’. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హిరోయిన్ గా నటిస్తోంది. ఇక శివగామి రమ్యకృష్ణ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ‘గ్యాంగ్‌’ టైటిల్‌తో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

 

తాజాగా ‘గుండెల్లో ధైర్యం.. చేతిలో ధర్మం ఉంటే మనం దేనికీ భయపడక్కర్లేదు’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు సూర్య. ఇటీవల ‘గ్యాంగ్‌’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం బుధవారం సాయంత్రం టీజర్‌ను విడుదల చేసింది. ‘విషయం లేని వాళ్లేమో ఇక్కడ.. విషయం ఉన్నవాళ్లేమో ఎక్కడో అలా అడ్రస్‌ లేకుండా మాయమైపోతున్నారు సర్‌’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘ఒక్కడు కోటీశ్వరుడు అవడానికి కోటి మంది అడుక్కు తినాల్సి వస్తోంది. మొత్తం తవ్వి బయటికి తీస్తే.. మన దేశంలో ఉన్న చాలా సమస్యల్ని ఈకల్లా పీకి పారేయొచ్చు’ అని సూర్య అంటుంటే.. పై అధికారి ‘ఆ పీకేస్తారా?’ అని ప్రశ్నించారు. దీనికి ఆయన ‘నేనొక్కడ్నే ఏమీ పీకలేను సర్‌.. మనందరం కలిస్తే ఏమైనా పీకొచ్చు సర్‌’ అని సూర్య చెప్పే డైలాగ్‌ కామెడీగా అనిపించినా సీరియస్ నెస్ కనిపిస్తోంది. చివర్లో సూర్య సీరియస్‌ డైలాగ్‌.. మధ్యలో రమ్యకృష్ణ దగ్గడం.. మరో హైలైట్‌గా నిలిచింది.

 

స్టూడియో గ్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

loader