సంక్రాంతి రేసులో సూర్య "గ్యాంగ్"

surya gang in sankranthi race
Highlights

  • సంక్రాంతికి తమిళ స్టార్ హీరో సూర్య గ్యాంగ్ మూవీ
  • ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన అజ్ఞాతవాసి, జైసింహ
  • లైన్లో..  తమిళం నుంచి డబ్ కానున్న  విశాల్ అభిమన్యుడు

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘గ్యాంగ్’ మూవీ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. తమిళ టాప్ డైరెక్టర్ వేగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘తాన సేరందకూటం’ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

 

ఇప్పటికే తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో టాలీవుడ్‌లో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న విడుదలకు సిద్ధంకాగా.. బాలయ్య-నయనతార జోడీగా నటిస్తున్న ‘జై సింహా’ జనవరి 12 తేదీని పిక్స్ చేసుకుంది. అయితే బాలయ్య మూవీ రిలీజ్ రోజునే సూర్య ‘గ్యాంగ్’ విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వార్ రంజుగా మరింది.
 

అయితే గత సంక్రాంతికి ఖైదీ, శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల లిస్ట్‌లో చేరాయి. మరి 2018 సంక్రాంతి బరిలో ఉన్న ‘అజ్ఞాతవాసి, జై సింహా, గ్యాంగ్’ చిత్రాల్లో బాక్సాఫీస్ బాద్ షాగా ఎవరు నిలుస్తారో చూడాలి.

loader