కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. తమ అభిమాన హీరో కటౌట్ ని కూల్చేయడంతో తట్టుకోలేని ఫ్యాన్స్ ఆందోళనికి దిగారు. నేడు వరల్డ్ వైడ్ గా సూర్య నటించిన NGK సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమాకు సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. 

అయితే సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా తిరుత్తణిలో 215 అడుగుల భారీ కటౌట్‌ ని ఏర్పాటు చేయగా అది అందరిని ఆకర్షించింది. అయితే అనుమతి లేకుండా ఆ స్థాయిలో కటౌట్ ని ఏర్పాటు చేశారని స్థానిక మున్సిపల్ అధికారులు కటౌట్ ని కూల్చేశారు. 

ఆగ్రహించిన అభిమానులు మున్సిపల్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కార్యాలయాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.