కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. అదే విధంగా ఆయన విజయం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉందని తెలిపారు. NGK సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సూర్య రీసెంట్ గా హైదరాబద్ కి వచ్చారు. 

సినిమా పై తన వివరణను ఇచ్చిన సూర్య జగన్ గురించి కూడా మాట్లాడారు..'వైస్ జగన్ కి ఇది అపురూప విజయమే కావచ్చు. కానీ ఆయన విజయం వెనుక కఠోర శ్రమ ఉంది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఆ విజయం. ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొని జగన్ గారు మరింత విజయాన్ని అందుకోవాలని సూర్య మాట్లాడారు.  

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా NGK సినిమా ఈ నెల 31న తమిళ్ - తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సూర్య సరసన సినిమాలో రకుల్ [ప్రీత్ - సాయి పల్లవి కథానాయికలుగా నటించారు.