హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వాల్మీకి. తమిళ సూపర్ హిట్ జిగర్తాండ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, జర్రా జర్రా సాంగ్ మాస్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రాన్ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరందుకున్నాయి. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ వాల్మీకి చిత్రం గురించి ట్విట్టర్ లో ఆసక్తికర విషయాన్ని ప్రకటించాడు. సుకుమార్ తో కలసి ఉన్న ఫోటోని ట్వీట్ చేశాడు. 'వాల్మీకి చిత్రంలో సుకుమార్ నుంచి చిన్న సర్ ప్రైజ్. వాల్మీకి చిత్రంలో భాగమైనందుకు ఆయనకు కృతజ్ఞతలు అని హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. 

ఇంతకీ సుకుమార్ ఇచ్చే సర్ ప్రైజ్ ఏంటనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. సుకుమార్ ఈ చిత్రంలో లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని, వాయిస్ ఓవర్ ఇస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 

వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాడీ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ గా మారిపోయింది. వరుణ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే లంగా ఓణిలో కనిపిస్తున్న స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి.