కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకథలను ఎంచుకోవడంలో డిఫరెంట్ గా ఆలోచిస్తారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. సాలా ఖదుస్ - గురు వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర సూర్య 38వ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ బయోపిక్ అని తెలుస్తోంది. ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపినాథ్ జీవిత ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు టాక్ వస్తోంది. విమాన పరిశ్రమలలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకోవచ్చి కనీసధరలకు టికెట్స్ రేట్స్ ను అందుబాటులోకి వచ్చేలా చేసిన గోపినాథ్ జీవితం ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని అందుకే అయన జీవితాన్ని తెరపై చూపించడానికి సుధా శ్రీకారం చుట్టారు. 

సూర్యా కూడా సినిమా కథను వినగానే వెంటనే ప్రాజెక్ట్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య సెల్వా రాఘవన్ అలాగే కెవి.ఆనంద్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.