సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. షాంఘై(చైనా)లో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించేందుకు ఎంపికైంది. 

సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. షాంఘై(చైనా)లో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పనోరమ సెక్షన్‌లో ప్రదర్శించేందుకు ఎంపికైంది. ఇండియా నుంచి ఎంపికైన మూడు సినిమాల్లో `సూరరైపోట్రు`(ప్రైజ్‌ ది బ్రేవ్‌) ఒకటి కావడం విశేషం. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. అపర్ణ బాలమురళీ హీరోయిన్‌గా నటించింది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై సూర్య, గునీత్‌ మొంగా సంయుక్తంగా నిర్మించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సినిమా కరోనా కారణంగా నిరుడు నవంబర్‌ 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి వ్యూస్‌ని దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పటికే `78వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్` లో ప్రదర్శించబడింది. అలాగే ఈ ఏడాది అందించిన 93వ ఆస్కార్‌ నామినేషన్‌కి పంపబడింది. కానీ ఎంపిక కాలేదు. తాజాగా షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపిక కావడం విశేషం. ఈ ఫెస్టివల్‌కి సౌత్‌ నుంచి ఎంపికైన ఏకైక సినిమా `ఆకాశం నీ హద్దురా` కావడం మరో విశేషం. ఈ ఫెస్టివల్‌ జూన్‌ 11న ప్రారంభమై జూన్‌ 20న ముగుస్తుంది. 

Scroll to load tweet…