క్రేజీ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ఎన్జీకే. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య, సాయి పల్లవి ఈ చిత్రంలో జంటగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించింది. ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్, మార్కెట్ ఉన్నాయి. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో సూర్య తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. దీనితో తెలుగులో కూడా సూర్య నటించిన చిత్రాలు మంచి వసూళ్లు రాబడుతుంటాయి. ఎన్జీకే చిత్రంపై కూడా మంచి బజ్ నెలకొని ఉంది. ఎన్జీకే చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్ ని బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి చిత్రాలని నిర్మించిన కె కె రాధామోహన్ సొంతం చేసుకున్నారు. 

ఎన్జీకే చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్ 8 కోట్లకు అమ్ముడయ్యాయి. సూర్య చిత్రానికి తెలుగులో ఇది మంచి ధర అని చెప్పొచ్చు. హిట్ టాక్ వస్తే సూర్య చిత్రం 8 కోట్లకు రాబట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.