Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల్లో జాక్ పాట్ కొట్టిన సూర్య 'కంగువ'..మైండ్ బ్లోయింగ్ ధరకి థియేట్రికల్ రైట్స్

హీరో సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. డైరెక్టర్ శివ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సూర్య ఈ చిత్రంలో వారియర్ కింగ్ గా కనిపిస్తున్నారు.

suriya kanguva movie gets sensational price in telugu states dtr
Author
First Published Jul 6, 2024, 12:21 PM IST | Last Updated Jul 6, 2024, 12:21 PM IST

హీరో సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. డైరెక్టర్ శివ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సూర్య ఈ చిత్రంలో వారియర్ కింగ్ గా కనిపిస్తున్నారు. సూర్య గెటప్ ఆసక్తిని పెంచుతోంది. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

దీనితో నిర్మాతలు పాన్ ఇండియా వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యకి అద్భుతమైన క్రేజ్ ఉంది. తమిళంతో పటు తెలుగులో కూడా సూర్య చిత్రాలు వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. దీనితో కంగువ చిత్రానికి తెలుగు మార్కెట్ కూడా చాలా కీలకం. 

ఎన్నో చర్చలు బేరసారాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కంగువ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థకి కంగువ థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో దక్కాయట.  మైండ్ బ్లోయింగ్ ధరకి కంగువ నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. 

ఏకంగా 25 కోట్ల డీల్ కుదిరిందట. నైజం ఏరియాలో 15 కోట్లకు, ఆంధ్ర లో 10 కోట్లకు కంగువ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్ కి ముందే కంగువ నిర్మాతలు తెలుగు రాష్ట్రాల నుంచి పాతిక కోట్లు పాకెట్ లో వేసుకున్నారు, సూర్య గత చిత్రాలతో పోల్చితే ఇది దిమ్మ తిరిగే ధర. సూర్య గత చిత్రాల బిజినెస్ తెలుగులో 10 నుంచి 15 కోట్ల వరకు ఉండేది. కానీ కంగువ చిత్రం విజువల్ ఫీస్ట్ గా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios