`విక్రమ్‌` చిత్రంలో మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దీనిపై క్లారిటీ ఇచ్చింది. హీరో సూర్య గెస్ట్ రోల్‌ చేస్తున్నట్టు చెప్పారు.

కమల్‌ హాసన్‌(Kamal Haasan) హీరోగా నటించిన `విక్రమ్‌`(Vikram) మూవీ ట్రైలర్‌ ఆదివారం విడుదలై ట్రెండ్‌ అవుతుంది. ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా సాగిన నేపథ్యంలో ఆడియెన్స్ ని విపరీతంగా ఆట్టుకుంటుంది. ఇందులో కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం మరోసారి చూపించారని చెప్పొచ్చు. ఆయనతోపాటు కీలక పాత్రల్లో నటించిన విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ సైతం ఇరగదీశారు. వీరు నటనే హైలైట్‌గా సినిమా ఉండబోతుందని, దీనికితోడు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మార్క్ టేకింగ్‌ సినిమా వేరే లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. 

అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం, బీజీఎం సినిమాకి బ్యాక్‌ బోన్‌గా ఉంటాయని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈవెంట్‌లో చిత్ర ట్రైలర్‌తోపాటు పాటలను విడుదల చేశారు. అయితేఈ చిత్రంలో మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దీనిపై క్లారిటీ ఇచ్చింది. హీరో సూర్య గెస్ట్ రోల్‌ చేస్తున్నట్టు చెప్పారు. అయితే సూర్య ఏ పాత్రలో కనిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సూర్య(Suriya) నటించే పాత్రపై ఓ క్లారిటీ వస్తుంది. ఆయన ఇందులో గ్యాంగ్ లీడర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్‌లో వైట్‌ షర్ట్, బ్లాక్‌ పాయింట్‌తో బ్యాక్‌ నుంచి కనిపిస్తున్నాడు. కత్తి నెలపై విసిరిన లుక్‌లోనూ ఆయన కనిపించారు. అయితే సినిమాలో మెయిన్‌ గ్యాంగ్‌స్టర్‌ అతనే అని టాక్‌. ఇందులో `విక్రమ్‌` కమల్‌ హాసన్‌ వద్ద ఉన్న ఓ చిన్న కుర్రాడి పేరే `విక్రమ్‌` అని, కమల్‌ సినిమాలో భార్యని కోల్పోయిన ఒంటరి వ్యక్తి అని, తన భావాలను, ఆలోచనలను ఆ చిన్న కుర్రాడితోనే పంచుకుంటాడని టాక్‌. కమల్‌ వద్ద ఉన్న చిన్నారి సూర్య కుమారుడే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Scroll to load tweet…

అయితే ఇందులో కమల్‌ `రా` ఏజెంట్‌గా కనిపిస్తారనే వార్తలొచ్చాయి. కానీ ట్రైలర్‌లో చూస్తుంటే ఆయన గ్యాంగ్‌స్టర్‌ తరహా పాత్రలో కనిపిస్తున్నారు. కమల్‌, విజయ్‌ సేతుపతి గ్యాంగ్‌స్టర్స్ గా, ఫహద్‌ ఫాజిల్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. మరి ఎవరు ఏ పాత్రలో కనిపించబోతున్నారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్‌ 3న తెలుగు, తమిళంలో విడుదల కానుంది. కమల్‌తోపాటు ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు.