Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవికి పోటీగా సూర్య , ఊహించని ట్విస్ట్

 ఈ సినిమాకి గాను చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ తో దీనిని అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంకి డి ఇమన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 

Suriya Etharkkum Thunindhavan to release on Acharya date
Author
Chennai, First Published Nov 19, 2021, 4:45 PM IST

తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా పై పోటీగా ఎవరూ రంగంలోకి దిగటం లేదు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు తమిళ హీరో సూర్య తన సినిమాని ఆచార్యపై పోటీకి పెడుతున్నారు.  సాలిడ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు పాండిరాజ్ తో “ఎతరక్కుమ్ తునిందవన్” అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని అనౌన్స్ చేసిన నాటి నుంచి కూడా మంచి అంచనాలు నెలకొల్పుకుంది. 

ఇప్పుడు ఈ సినిమాకి గాను చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ తో దీనిని అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంకి డి ఇమన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. దాంతో అదే రోజున చిరంజీవి ఆచార్య కూడా రిలీజ్ అవుతూండటంతో పోటీ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి తెలుగు నుంచి ఎవరూ ఈ సినిమాపై పోటీగా వెళ్లటం లేదు. ఈ సమయంలో తమిళం నుంచి సినిమా పోటీకి రావటం అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పటికే  ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి కానుకగా థియేటర్‌లలో అలరించాల్సిన ఈ సినిమా... కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది. తొలుత దసరా కానుకగా తీసుకువస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. 

కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న  ‘ఆచార్య’  సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజాహెగ్డే తళుక్కున మెరవనుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ‘ఆచార్య’ను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
 
సూర్య సినిమాలు కోసం తెలుగులో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య హీరోగా నటించిన లాస్ట్ రెండు చిత్రాలు “ఆకాశం నీ హద్దురా”, “జై భీమ్” సినిమాలు నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యి యూనానిమస్ గా హిట్ అయ్యాయి. అయితే సూర్య ఈ స్టెప్ తీసుకోవడం కాస్త బాధాకరమే అయినా ఈసారి మాత్రం థియేట్రికల్ రిలీజ్ తోనే సూర్య రెడీ అవుతున్నాడు.  సూర్య సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆచార్య సినిమాకి ఇది గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios