కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. సినిమా పరిశ్రమపై దీని ప్రభావం చాలా ఉంది. ఇప్పటికే చాలా రోజులుగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేటర్లు బంద్‌ అయ్యాయి. సౌత్‌ మొత్తం లాక్‌డౌన్‌ పాటిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనాని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు తలమునకలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు హీరో సూర్య ఫ్యామిలీ. హీరోలు సూర్య, కార్తి, వారి తండ్రి నటుడు శివకుమార్‌ కలిసి తమిళనాడు ప్రభుత్వానికి కోటీ రూపాయల విరాళం అందచేశారు. 

తాజాగా తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వంతుగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి కోటి రూపాయలు విరాళంగా అందించారు సూర్య బ్రదర్స్. ఫస్ట్ వేవ్‌లోనూ సూర్య ఫ్యామిలీ  భారీగా విరాళం అందించారు. సెకండ్‌ వేవ్‌లో ఇంతటి భారీ మొత్తాన్ని ప్రకటించిన తొలి స్టార్స్ గా వీరు నిలవడం విశేషం. వీరిని సీఎం స్టాలిన్‌ అభినందించారు. 

సూర్య ఇటీవల `ఆకాశం నీ హద్దురా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ఆయన పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీంతోపాటు మరో సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. అలాగే కార్తి ఇటీవల `సుల్తాన్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా పరాజయం చెందింది. ఇప్పుడు `సర్దార్‌` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంలో నటిస్తున్నారు.