తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సూర్య. గజినీగా, సింగంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. సూర్య చివరగా నటించిన చిత్రం ఈటి.

తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సూర్య. గజినీగా, సింగంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. సూర్య చివరగా నటించిన చిత్రం ఈటి. మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీనితో సూర్య తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. సూర్య ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో చివర్లో స్పెషల్ రోల్ ప్లే చేశాడు. 

ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ఆ మధ్యన విడుదలైన మోషన్ పోస్టర్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం ఐంది. 

సూర్యకి క్లాస్ ఆడియన్స్ తో పాటు మాస్ అభిమానులు కూడా ఉన్నారు. వారి కోసం సూర్య సింగం లాంటి మాస్ చిత్రాలు చేయడం చూస్తూనే ఉన్నాం. సింగం సిరీస్ తో సూర్య ఒక సూపర్ కాప్ లాగా మారిపోయాడు. 

సింగం సిరీస్ లో వచ్చిన మూడు చిత్రాలు ప్రేక్షకులని బాగా అలరించాయి. ఇప్పుడు సింగం 4 రెడీ అవుతున్నట్లు బలమైన న్యూస్ వినిపిస్తోంది. 2010లో సింగం మొదటి భాగం.. 2013లో రెండవ భాగం.. 2017లో మూడవ భాగం రిలీజ్ అయ్యాయి. ఇటీవల డైరెక్టర్ హరి సింగం 4 కి సంబంధించిన స్టోరీ లైన్ సూర్యకి వినిపించారట. స్టోరీ లైన్ నచ్చడంతో డెవెలప్ చేయమని సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో సూర్య అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. పోలీస్ అధికారి పాత్ర సూర్యకి అద్భుతంగా సెట్ అయింది అనే చెప్పవచ్చు.