Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ న్యూస్.. బాల సినిమా నుంచి తప్పుకున్న సూర్య, కారణాలు వివరిస్తూ..లెటర్ రాసిన దర్శకుడు

కోలీవుడ్ నుంచి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ హీరో సూర్య.. సీనియర్ డైరెక్టర్ బాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నట్టు సమాచారం.

Suriya And Balas Vanangan Movie Shelved
Author
First Published Dec 5, 2022, 1:44 PM IST

కోలీవుడ్ నుంచి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ హీరో సూర్య.. సీనియర్ డైరెక్టర్ బాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నట్టు సమాచారం.

కాంట్రవర్సియల్ .. అండ్ స్టార్ సీనియర్ డైరెక్టర్ బాల.. తమిళ స్టార్ హీరో సూర్య. ఈ ఇద్దరి కాంబో అంటే ఫ్యాన్స్ కు పూనకాలే. వీరిద్దరి కలయికలో వచ్చిన శివపుత్రుడు తమిళ,తెలుగు ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మళ్లీ 18ఏళ్ళ త‌ర్వాత వీరిద్దరూ క‌లిసి అచలుడు అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఈమూవీపై ప్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారగా అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో  40శాతం షూటింగ్‌ కూడా పూర్తయింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి సూర్య తప్పుకున్నట్లు దర్శకుడు బాలా ప్రకటించి షాక్ ఇఛ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎందుకు సూర్య ఈ సినమా నుంచి తప్పుకున్నాడంటే..? 

ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యింది. మూవీకి  తెరకెక్కుతుంది అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో ఇలా అర్ధాంతరంగా సూర్య ఈ సినిమా నుండి తప్పుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ క్రమంలో డైరెక్టర్  బాలా సోషల్‌ మీడియాలో ఓ లేఖను విడుదల చేసి క్లారిటీ ఇచ్చాడు. ఆ లేఖలో బాల ఏమన్నాడంటే..అచలుడు కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని, దాంతో ఈ సినిమా కథ అంతా మారిపోవడంతో.. సూర్య ఈకథకు సూట్ అవ్వడని దర్శకుడికి అనిపించిందట. దాంతో 40 శాతం షూటింగ్ పూర్తి అయిన తరువత కూడా సూర్య ఈసినిమా నుంచి తప్పుకోవల్సి వచ్చిందట. 

 

అయితే బాల - సూర్య మధ్య కమ్యూనికేషన్ తో పాటు ఇద్దరు పరస్పర అంగీకారంతోనే ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. సూర్యకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బాలా లెటర్‌లో వివరంగా తెలిపాడు. అయితే సూర్య తప్పుకున్నా ఈ సినిమా మాత్రం కొనసాగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు. అయితే అందులో ఎవరు హీరోగా నటిస్తారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు స్టార్ డైరెక్టర్.

 గతంలో కూడా బాల చాలా సార్లు ఇలానే చేశాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌ను కూడా ముందుగా ధృవ్ విక్రమ్‌తో తెరకెక్కించాడు. షూటింగ్‌ కూడా పూర్తయింది. కానీ అవుట్‌ పుట్‌ సరిగ్గాలేదని సినిమాను కాన్సిల్‌ చేశారు అంతకు ముందు  కూడా తమిళ స్టార్ హీరో  అజిత్‌తో సినిమా మొదలు పెట్టి, మధ్యలోనే ఆ మూవీని  కాన్సిల్‌ చేశాడు. ఇక ఇప్పుడు సూర్యతో కూడా సినిమా కాన్సిల్ చేశాడు. ఇలా కాంట్రవర్సియల్ నిర్ణయాలతో బాల కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు.  అయితే ఇక్కడ మరో విశేషం ఏంటీ అంటే.. ఈ సినిమాను సూర్య సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మరి హీరోగానే తప్పుకున్నాడా..? లే నిర్మాతగా కూడా తప్పుకున్నట్టేనా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios