Asianet News TeluguAsianet News Telugu

గోవాలో ఏం జరిగింది? అరవింద్ కు ఎందుకు కోపం వచ్చింది

ఆ జర్నలిస్ట్ ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ హీరోలకు పిఆర్ఓ అని చెప్పాడా? మా ఫ్యామిలీలోని హీరోలతో ఫోటోలు దిగినంత మాత్రాన పిఆర్ఓ అయ్యిపోతాడా? 

Suresh Kondeti is not a PRO to our family Allu Aravind jsp
Author
First Published Dec 5, 2023, 9:19 AM IST


ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ కు సినిమా పరిశ్రమలో ఉన్నంత గ్రిప్ ఎవరికీ లేదనే చెప్పాలి. అయితే ఎప్పుడూ దాన్ని చూపించరు. సరదాగా కలుపుగోలుతనంగా మాట్లాడుతూంటారు. ఎంత ఎదిగినా అన్నట్లు స్టేజిపై చిన్నగానే ఉంటారు. అయితే ఆయనకు కోపం వచ్చింది. అందుకు కారణం రీసెంట్ గా ఓ జరిగిన ఓ వివాదం. దాంతో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తూ మండిపడ్డారు. ఇంతకీ ఏమిటా విషయం..అంటే

సంతోషం సినీ అవార్డ్స్ వేడుకలను గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్ట్ సురేష్ కొండేటి నిర్వహిస్తున్నారు. తాజాగా గోవాలో సంతోషం సినీ అవార్డ్స్ వేడుకలను నిర్వహించారు. ఈ సారి సౌత్‌ తో పాటు బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. తెలుగు కన్నడ తమిళ మళయాళ పరిశ్రమ నటీనటులని పురస్కరించుకోవాలని సన్నాహాలు చేశారు.  కానీ కార్య నిర్వహణలో లోపాలు జరిగాయి. వచ్చిన సెలబ్రిటీలకు సరైన వసతి కల్పించలేకపోయారు. అలాగే తెలుగు అవార్డులు ముగిసిన తర్వత వేదికలో కరెంట్ లేకుండాపోయింది.  నిజానికి ఈ వేడుకకు గోవా ముఖ్య్యమంత్రి రావాలి. కానీ  ఆయన వేడుకకు రాకుండానే వెనుతిరిగారు.  

 కన్నడ పరిశ్రమకు చెందిన 35 మంది అక్కడకు చేరుకున్నారు. వారిలో కన్నడ సూపర్ స్టార్ హీరో రమేష్ అరవింద్, కాంతార ఫేమ్ సప్తమి గౌడ్ తదితరులు వెళ్లారు. టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి అవార్డ్స్ ఇవ్వడం అయిపోయాక.. కన్నడ పరిశ్రమకు సంబంధించి అవార్డులను అందజేసేందుకు వేదికపైకి ఎక్కారు రమేష్ అరవింద్. ఇద్దరి ముగ్గురికి అవార్డులు ఇచ్చాక.. అంతలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఎంత సేపటికి కరెంట్ తిరిగి రాకపోవడంతో అక్కడ నుండి వెనుదిరిగారు కన్నడ ప్రముఖులు. ఈ ఘటనపై మీడియాతో రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. అవార్డులు ఇస్తుండగా.. కరెంట్ పోవడంపై ఆరా తీస్తే.. లైట్స్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదని తెలిసిందని, తామే కాదూ మిగిలిన ఇండస్ట్రీకి వ్యక్తులు కూడా ఇబ్బందులకు గురయ్యారంటూ తెలిపారు.

దాంతో స్టేజ్ మీద కన్నడ సెలెబ్రిటీలను అవమానించారని, హోటల్ సిబ్బందితోనూ ఇబ్బంది ఏర్పడిందని, కనీసం రూం బిల్లులు కూడా చెల్లించలేదని ఇలా నానా రకాలుగా కన్నడ ప్రతినిధులు, మీడియా సంతోషం అవార్డు వేడుకల మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుపట్టడం జరిగింది.  ఈ వేడుకలను నిర్వహించిన సురేష్ కొండేటి పేరుతో పాటు అతడు మెగా ఫ్యామిలీకి మంచి స్నేహితుడని, ప్రముఖ స్టార్ పీఆర్వోఓ అంటూ  కథనాలు వచ్చేశాయి. ఈ వార్తలపై స్పందించారు నిర్మాత అల్లు అరవింద్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించి.. మెగా కుటుంబానికి అతడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 

ఆ జర్నలిస్ట్ ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ హీరోలకు పిఆర్ఓ అని చెప్పాడా? మా ఫ్యామిలీలోని హీరోలతో ఫోటోలు దిగినంత మాత్రాన పిఆర్ఓ అయ్యిపోతాడా? అవార్డుల ఫంక్షన్ నిర్వహించడం అనేది ఆ జర్నలిస్ట్ వ్యక్తిగత విషయం. అందులో లోపాలు జరిగితే దాన్ని మొత్తం ఇండస్ట్రీకి లేదా ఒక వ్యక్తికీ ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అలాగే ‘ఎప్పుడైనా అతడు మా పక్కనే కనబడితే.. ఆయన పీఆర్వో అంటూ పత్రికలు రాయడం కరెక్ట్ కాదు. ఆ అవార్డులు ఆయన వ్యక్తిగతం. వాటి నిర్వహణలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఇతర భాషల వాళ్లకు ఇబ్బందులు జరిగాయి. వాళ్లు కూడా తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇంతే.. తెలుగు ఇండస్ట్రీలో వాళ్లింతే అన్నారట. కొన్ని పత్రికల్లో అవి రావడం చూసి బాధేసింది. ఓ వ్యక్తి చేసిన దానికి.. ఎవరికో దానిని ఆపాదించడం కానీ, టాలీవుడ్‌కు ఆపాదించడం కరెక్ట్ కాదు. అతడు ఎవ్వరికీ పీఆర్వో కాదూ.. మా కుటుంబంలోని ఎవ్వరికీ పీఆర్వో కాదు. అతడికి కూడా ఇండస్ట్రీకి ద్రోహం చేయాలన్న ఉద్దేశం లేదు. పర్సనల్‌గా ఫెయిల్యూర్ అయ్యాడు. అది తెలుగు ఇండస్ట్రీకి ఆపాదించవద్దని కోరుతున్నా’అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios