చిన్న సినిమాలనే ఎక్కువ రేట్లకు అమ్మడం సురేష్ బాబుకే చెల్లింది. సినిమాల విషయంలో ఆయన ఫాలో అయ్యే టెక్నిక్స్ అలా ఉంటాయి మరి. ప్రస్తుతం సురేష్ బాబు 'వెంకీ మామ' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను మొత్తంగా పది కోట్ల బడ్జెట్ లో పూర్తి చేయాలనేది ప్లాన్.

హీరోలకు రెమ్యునరేషన్స్ సినిమా విడుదలైన తరువాత ఇవ్వాలని భావిస్తున్నాడు సురేష్ బాబు. వెంకీ, చైతు ఇంట్లో హీరోలే కాబట్టి పెద్దగా సమస్య ఉండదు. అయితే ఈ ఇద్దరు హీరోలకు రీసెంట్ గా 'ఎఫ్ 2', 'మజిలీ' లాంటి హిట్ సినిమాలు రావడంతో దాన్ని 'వెంకీ మామ' ద్వారా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. 

సినిమాను కొనాలని అనుకుంటున్న వారికి భారీ రేట్లు చెప్పి షాక్ ఇస్తున్నాడు. తాజాగా సినిమా శాటిలైట్ రైట్స్ కోసం రెండు, మూడు చానెళ్లు ప్రయత్నించాయి. అయితే సురేష్ బాబు చెప్పిన అమౌంట్ కి షాక్ అయిపోయిన వారు అక్కడి నుండి పరార్ అయ్యారట.

ఒక్క శాటిలైట్ రైట్స్కోసమే రూ.13 కోట్లు చెబుతున్నాడట సురేష్ బాబు. ఏదైనా అడిగితే ఎఫ్ 2, మజిలీ పేర్లు చెబుతున్నారట. ప్రస్తుతం 'వెంకీ మామ'కి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చర్చల దశలోనే ఉన్నాయి. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి