రానా అవతారం చూసి షాక్ అయ్యాను.. సురేష్ బాబు కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 8, Sep 2018, 4:39 PM IST
suresh babu comments on hero rana daggubati
Highlights

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నాడు

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నాడు.

ఈ పాత్ర రానా తన శరీర బరువుని తగ్గించుకొని కొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు. ప్రస్తుతం రానాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రానా లుక్ కి సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో రానా నడిచొస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తన కొడుకు అవతారం చూసి షాక్ అయినట్లు చెబుతున్నాడు సురేష్ బాబు. ''ఇది నన్ను షాక్ కి గురి చేసింది. రానా స్టూడియోలో అచ్చం చంద్రబాబు నాయుడిగా స్టిల్ ఇస్తూ నించున్నాడు. నేను గుర్తు పట్టలేకపోయాను. సినిమాలో అతడి పాత్ర మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది'' అని కామెంట్ చేశారు. 

 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader