కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరగబడ్డ ఉద్యమ వీరుడు నరసింహారెడ్డి. చాలా ఏళ్ల క్రితమే ఈ చిత్రంలో నటించాలని చిరంజీవి భావించారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఇప్పటివరకు ఆగాల్సి వచ్చింది. రాంచరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

1847లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. ఆయన తల నరికి కోట గుమ్మానికి వేలాడదీశారు. సాధారణంగా ట్రాజడీ ఎండింగ్ ఉండే చిత్రాలు తెలుగులో ఆడవనే ఒక ఫోబియా ఉంది. దీని గురించి ట్రైలర్ లాంచ్ సంద్భరంగా దర్శకుడు సురేందర్ రెడ్డికి మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. 

సాధారణంగా ట్రాజడీ సినిమాలు తెలుగులో వర్కౌట్ కావు. సినిమా ఎంత బావున్నా కమర్షియల్ గా అలాంటి చిత్రాలు నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటి అని మీడియా ప్రశ్నించగా.. సైరా ఎందుకు కమర్షియల్ గా వర్కౌట్ కాదు. నరసింహారెడ్డి జీవితమే సినిమా పరంగా చాలా కమర్షియల్ పాయింట్. 

ఆయనని ఉరి తీసిన తర్వాత తలని దాదాపు 30 ఏళ్ల పాటు కోటకు వేలాడదీశారు. అలా చేశారంటే నరసింహారెడ్డి వారిని ఎంతలా భయపెట్టి ఉంటాడు.. ఇంతకంటే కమర్షియల్ పాయింట్ ఉంటుందా అని సురేందర్ రెడ్డి ప్రశ్నించారు.