సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ ఇండియన్ అన్ని భాషలు, హిందీలో ఈ చిత్రాన్ని పెద్దఎత్తున రిలీజ్ చేస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సైరా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం ఏ హీరోతో ఉన్నటుందనే ఆసక్తి నెలకొని ఉంది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సైరా చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. భవిష్యత్తులో బాలీవుడ్ హీరోని డైరెక్ట్ చేసే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా.. తప్పకుండా చేస్తానని సురేందర్ రెడ్డి అన్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలనేది తన కోరిక అని అన్నారు. 

సైరా చిత్రం హిందీలో విజయం సాధిస్తేసల్మాన్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం  సురేందర్ రెడ్డికి ఉంటుందనడంలో సందేహం లేదు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేశారు. ఆ చిత్రంలో బాలీవుడ్ లో రికార్డ్ వసూళ్లు రాబట్టింది.