సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తల్లి కూతుళ్లు సురేఖ వాణి, సుప్రీతా మరోసారి వైరల్ అయ్యారు. సమ్మోహనుడా సాంగ్ కి వీరిద్దరూ అదరహో అనిపించేలా డ్యాన్స్ చేసి మెప్పించారు. 

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న రూల్స్ రంజన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన సమ్మోహనుడా అనే సాంగ్ వల్లే ఈ రేంజ్ లో పబ్లిసిటీ దక్కుతోంది. నేహా శెట్టి అందాలు ఆరబోస్తూ మతిపోగోట్టే డ్యాన్స్ తో ఈ సాంగ్ ఓ కవ్విస్తోంది. 

శ్రేయ ఘోషల్ మైకం తెప్పించే ఎంతో మధురంగా ఈ పాటని పాడింది. ప్రస్తుతం ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు, ప్రేక్షకులు అనే తేడా లేకుండా రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తల్లి కూతుళ్లు సురేఖ వాణి, సుప్రీతా మరోసారి వైరల్ అయ్యారు. సమ్మోహనుడా సాంగ్ కి వీరిద్దరూ అదరహో అనిపించేలా డ్యాన్స్ చేసి మెప్పించారు. 

View post on Instagram

చీరకట్టులో సురేఖ వాణి, సుప్రీతా డ్యాన్స్ చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ కి మాత్రమే కాదు పాపులర్ అయ్యే ప్రతి వీడియోకి తల్లి కూతుళ్లు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక సుప్రీతా అయితే తన గ్లామర్ ఒలకబోసే విధంగా హాట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తోంది. 

View post on Instagram

తల్లీకూతుళ్లు ఇద్దరూ తరచుగా వెకేషన్స్ కి వెళ్లడం చూస్తూనే ఉన్నాం. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. సోదరి, తల్లి, వదిన లాంటి పాత్రలతో సురేఖ వాణి పాపులర్ అయింది. 

View post on Instagram

ఈ మధ్యన నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వివాదంలో కూడా సురేఖ వాణి, సుప్రీతా పేర్లు వినిపించాయి. మీడియాలో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. సురేఖ వాణి మాత్రం తమకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదుఅని స్టేట్మెంట్ ఇచ్చారు.