కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మంచి హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయన రీసెంట్ చిత్రాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో ఆయన కసితో సురారై పోట్రు మూవీ చేశారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, తెలుగులో ఆకాశం నీహద్దురా అనే టైటిల్ తో విడుదల అవుతుంది. ఈ మూవీ ప్రోమోలు చూసిన తరువాత చిత్ర విజయంపై నమ్మకం ఏర్పడింది. 

ఈ మూవీలో సూర్య లుక్ అండ్ మేనరిజం ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ఓ కీలక రోల్ చేయడం విశేషం. కాగా ఈ మూవీని అనూహ్యంగా నేరుగా ప్రైమ్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించి సంచలానికి తెరలేపారు. అక్టోబర్ 30నుండి ప్రైమ్ లో ఈ చిత్రం ప్రసారం కానుంది. మంచి బజ్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రైమ్ లో విడుదల చేయడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. 

థియేటర్స్ తెరుచుకోనున్నాయని కూడా తెలుస్తుండగా సూర్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఓ టి టి వైపు చూడడం ఆశ్చర్యం వేస్తుంది. సూర్య ఈ నిర్ణయం వెనుక భారీ ఆఫర్ రావడమే అని కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో వలే ప్రజలు థియేటర్స్ కి వస్తారనే నమ్మకం లేదు. అలాగే తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం వారితో సూర్యకు గొడవలు ఉన్నాయి. అందుకే సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు అనిపిస్తుంది.