గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాలు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేటు తగ్గించలేదని సుప్రీం కోర్టులో సినీ  ప్రేక్షకుల వినియోగదారులు సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఈ రెండు చిత్రాల నిర్మాతలకు సుప్రీం  కోర్టు నోటీసులు జారీ చేసింది.

గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్ర నిర్మాతలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాలు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేటు తగ్గించలేదని సుప్రీం కోర్టులో సినీ ప్రేక్షకుల వినియోగదారులు సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయంచలేదని ఆరోపించింది. ఈ చిత్రాలు పన్ను రాయితీ పొందిన డబ్బును తిగిరి ప్రభుత్వం రికవరీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్ర నిర్మాతలతో పాటు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సహా ప్రతివాదులకు నోటీసులు చేసింది. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర విషయానికి వస్తే.. ఇది నటుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. హేమమాలిని, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటించారు. వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2017 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శాతవాహన సామ్రాజ్యాధినేత గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పన్ను రాయితీ ఇచ్చాయి. 

ఇక, రుద్రమదేవి విషయానికి వస్తే.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిచ్చారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణంరాజు, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే 2015లో విడుదలైన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం మాత్రం పన్ను రాయితీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సమయంలో.. రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుణశేఖర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో గుణశేఖర్ పేర్కొన్న అంశాలపై తీవ్రమైన చర్చ సాగింది.