ఏకంగా ముగ్గురు సూపర్ స్టార్స్...‘స్పిరిట్‌’ని రిజెక్ట్ చేసారు

 ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్‌’ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ‘ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ చిత్రాలు చేయనున్నారు.

Superstars rejected Spirit,who are they

రీసెంట్ గా ప్రభాస్‌ 25వ చిత్రాన్ని ప్రకటించారు నిర్మాతలు. ‘స్పిరిట్‌’ పేరుతో... సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాని టి.సిరీస్‌, భద్రకాళీ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నాయి. భూషణ్‌ కుమార్‌ నిర్మాత. ఎవరూ ఊహించని ఓ కొత్త పాత్రలో ప్రభాస్‌ని చూడబోతున్నారని ఆ రకంగా సందీప్‌ రెడ్డి పాత్రని డిజైన్‌ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్‌’ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ‘ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ చిత్రాలు చేయనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ముగ్గురు సూపర్ స్టార్స్ తెలుగులో రిజెక్ట్ చేసారనే వార్త ఇప్పుడు అంతటా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్స్ అంటే మొదట ఈ కథను రామ్ చరణ్ కు చెప్తే నో చెప్పారట,. ఆ తర్వాత కొంతకాలానికి కొద్ది పాటి మార్పులతో మహేష్ బాబుకు నేరేట్ చేసారట. అక్కడా ఓకే కాలేదు. తర్వాత అల్లు అర్జున్ ని ఎప్రోచ్ అయ్యారట. అక్కడా అదే సమాధానం. దాంతో ఆ స్క్రిప్టుని ప్రక్కన పెట్టి యానిమల్ స్క్రిప్టు రెడీ చేసుకుని రణబీర్ కపూర్ తో ఎనౌన్స్ చేసారు. ఈ లోగా ప్రబాస్ నుంచి కాల్ వచ్చిందిట. ప్రభాస్ కు ఈ కథ చెప్పటం, ఏ మార్పులు లేకుండా వెంటనే ఓకే కావటం జరిగిందిట.ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గట్టు పాన్ ఇండియన్ లెవల్లో స్క్రిప్ట్ మార్చి ప్రభాస్‌కి చెప్పి ఒప్పించాడని అంటున్నారు.వచ్చే సంవత్సరం  ఈ ప్రాజెక్టు ప్రారంభం కావచ్చు.

ఇక ఈ సినిమాను ఆల్రెడీ 8 భాషలలో రిలీజ్ చేయనున్నట్టు ప్రాజెక్ట్ ప్రకటించినరోజే వెల్లడించారు. దాంతో ఇది పాన్ వరల్డ్ మూవీ అని అందరూ ఫిక్స్ అయ్యారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, చైనీస్, జాపనీస్ భాషలు సహా మొత్తం ఎనిమిది భాషలలో రిలీజ్ కానుంది. అయితే, ఇదే క్రమంలో 'స్పిరిట్' చిత్రాన్ని ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. ఇప్పటికే 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కే' ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'స్పిరిట్' మొత్తం 9 భాషల్లో రిలీజ్ అవడం పక్కా అని తెలుస్తోంది ఏదేమైనా టాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ సందీప్ దక్కించుకున్నాడు. ఇక మహేశ్ బాబుతో కూడా ఆయన ఓ సినిమా చేయనున్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios