సూపర్ స్టార్ రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా జైలర్ సినిమాపై చేశారు. జైలర్ సక్సెస్ విషయంలో నెల్సన్ కు షాక్ ఇచ్చారు తలైవా.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
వరుస ప్లాప్ సినమాలతో ఇబ్బంది పడ్డారు తమిళ సూపర్ స్టార్.. తలైవా రజినీకాంత్. ఇక ఆయన పని అయిపోయింది.. రజినీకాంత్ కు ఇక మార్కెట్ లేదు.. అంత రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకుంటున్నాడు అని.. రకరకాల కామెంట్లు చేసిన వారికి.. గట్టిగా ఇచ్చిపడేశాడు జైలర్ సినిమాతో. ఈసినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ ను శేక్ చేస్తూ.. వందల కోట్లు రాబట్టింది. ఇక ఈసినిమా ఫైనల్ గా దాదాపు 800 కోట్ల వరకూ రాబట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈసినిమా.. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా తన సత్తా చాటుతోంది. దాదాపు 36 దేశాల్లో.. జైలర్ మూవీ.. ఓటీటీలో ప్రభంజనం సృష్టించి రికార్డ్ సాధించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో... రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, వసంత రవి, సునిల్ తో పాటు.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్, నాగబాబు లాంటి సౌత్ స్టార్స్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన జైలర్ సినిమా.. ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. చాలా కాలం తరువాత రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ పడటం. అనూహ్యంగా నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలు రావడంతో.. రజినీకాంత్ కు, నెల్సన్ కు, అనిరుధ్ కు కోట్ల విలువ చేసే కార్లతో పాటు.. లాభాల్లో వాటాలు కూడా అందించాడు కళానిధి మారన్.
ఇక జైలర్ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు టీమ్. అంతే కాదు తాజాగా ఈమూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూ.. ఓ పార్టి ఇచ్చారు నిర్మాత. ఇక సక్సెస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించగా.. ఈ ఈవెంట్లో సినిమాకు పనిచేసిన వారందరికీ సక్సెస్ షీల్డ్ లతో పాటు ఒక బంగారు నాణెం కూడా ఇచ్చారు నిర్మాత. అయితే ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన జైలర్ సక్సెస్ గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ నెల్సన్ కు షాక్ ఇచ్చారు. ఈసినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తాన్ని అనిరుధ్ కు ఇచ్చేశాడు తలైవా. జైలర్ సినిమా సక్సెస్ లో అనిరుధ్ భాగం ఎక్కుంగానే ఉంది అది నిజమే కాని.. అసలు క్రెడిట్ అంతా అనిరుథ్ కే ఇచ్చేయడం అందరికి షాకింగ్ గా అనిపించింది. ఇంతకీ రజినీ కాంత్ ఏమన్నారంటే..?
ఒక సినిమా మంచి విజయం సాధిస్తే ఆర్టిస్టులని, టెక్నిషియన్స్ ని ఎలా గౌరవించాలో కళానిధి మారన్ కి తెలుసు. మొదటి నుంచి కూడా ఆయన సినిమా హిట్ అవుతుందని చెప్తూనే ఉన్నారు. సినిమా రీ రికార్డింగ్ ముందు కళానిధి అక్కడ ఉన్న కొంతమందిని సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుంది, హిట్ అవుతుందని చెప్పారు. ఇంకొకరు యావరేజ్ అన్నారు. నిజం చెప్పాలంటే జైలర్ సినిమా నాకు కూడా ఎబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ రీ రికార్డింగ్ మొత్తం అయ్యాక, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అనిరుధ్ నా కొడుకు లాంటివాడు. నాకు హిట్ ఇచ్చాడు, అతని ఫ్రెండ్ నెల్సన్ కి హిట్ ఇచ్చాడు అని అన్నారు. దీంతో రజిని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
జైలర్ సినిమా మ్యూజిక్ ప్రతీ ఒక్కరిని ఉత్సాహపరిచింది. ముఖ్యంగా తలైవా ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు..ప్రేక్షకులను సీట్లో కూర్చోనివ్వకుండా.. చేసిందా మ్యూజిక్. ఈ సినిమా మ్యూజిక్ సినిమాసక్సెస్ లో ముఖ్య భూమిక పోషించింది. కాని నెల్సన్ కథ, టేకింగ్ కూడా సినిమాకు బాగా ఉపయోగపడింది. అటువంటిది..ఈసినిమా క్రెటిట్ అంతా అనిరుధ్ కు ఇవ్వడంతో.. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.