జైలర్ సీక్వెల్ కు అడ్వాన్స్ తీసుకున్న నెల్సన్ దిలీప్.. సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
అనూహ్య విజయంతో.. సంబరాల్లో తేలిపోయారు జైలర్ మూవీ టీమ్. ఊహించని ఈ సక్సెస్ తో సంతోషంలో ఉన్న అభిమానులకు.. మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. జైలర్ మూవీ సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట డైరెక్టర్.

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)నటించిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనరన్ జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేసిన సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కాని అనూహ్యంగా.. మూవీ టీమ్ అనుకున్నదానికంటే కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్న తలైవాకు బ్లాక్ బస్టర్ సినిమాతో సూపర్ హిట్ లభించింది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపుగా 800 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఈమాట వినిపిస్తున్నా.. జైలర్ సక్సెస్ తరువాత ఇక ఏమాత్రం ఆలోచించకుండా సీక్వెల్ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీక్వెల్ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. అటు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా.. కథ విషయంలో ఓ క్లారిటికి వచ్చినట్టు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ ను స్టార్ట్ చేయడం తరువాయి అంటున్నారు టీయ్. ఇక నిర్మాత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.
అయితే.. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్-2 చిత్రానికి స్ర్కిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ చిత్రం కోసం నెల్సన్‌కు నిర్మాత కళానిధి మారన్ కళ్లు చెదిరే మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇచ్చారనే టాక్ నడుస్తోంది. 55 కోట్ల చెక్‌ను ఆయనకు అందించారని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ బ్యానర్‌పైనే రూపొందించనున్నారు. జైలర్ సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుద్ జైలర్ సీక్వెల్ కు కూడా స్వరాలు సమకూర్చనున్నాడు.