ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ„ న్స్‌ నిర్మించనున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌. ఇందులో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘దర్బార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశారు. 

Scroll to load tweet…

ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే తెలుస్తోంది. బుధవారం నుంచి ‘దర్బార్‌’ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల సినిమా ఫొటోషూట్‌ చిత్రాలు లీకైన విషయం తెలిసిందే. 30 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం. 

ఈ సినిమాలో రజనీ కుమార్తెగా నివేదా థామస్‌ కనిపించనున్నారని టాక్‌. ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే ఓ సామాజిక సమస్యలకు కమర్షియల్‌ హంగులు జోడించి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ ఇప్పటి వరకూ ఆయన రజనీకాంత్‌తో ఒక్క సినిమా కూడా తీయలేదు. దీంతో ‘దర్బార్‌’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని లైకాప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.