Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్టార్ రజినీకాంత్ కు గుడి కట్టిన అభిమాని, అభిషేకాలు,అర్చనలతో.. హడావిడి..

ఈమధ్య అభిమానాన్ని డిఫరెంట్ గా చూపించుకుంటున్నారు ఫ్యాన్స్.. కొత్తగా ఏది చేస్తే వార్తల్లోకి ఎక్కుతామా అని  వెతికి మరీ ఆపనితో  వైరల్ న్యూస్ అవుతున్నారు. తాజాగా తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమాని ఒకరు సరిగ్గా ఇలాంటి పనితోనే ప్రస్తుతం హైలెట్ అవుతున్నాడు. 

Superstar Rajinikanth Fan Building A Temple In Madurai Tamil Nadu JMS
Author
First Published Oct 27, 2023, 8:16 AM IST | Last Updated Oct 27, 2023, 8:16 AM IST

అభిమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు రెండు సార్లు చూసినా.. రెండొందల సార్లు చూసినా.. అభిమానం కాబట్టి చూడాలి అన్న ఇంట్రెస్ట్ తో చూశారు అనుకోవచ్చు. కాని ఈమధ్య అభిమానులు.. రికార్డ్ ల కోసం.. వార్తల్లో నిలవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా  ఓ సూపర్ స్టార్ అభిమాని.. ఏకంగా తలైవాకు  గుడి కట్టేశాడు. గుడి కట్టడంతో వదిలేయలేదు.. ఏకంగా రోజూ.. పూజలు చేస్తూ.. అభిశేకాలు అర్చనలతో హడావిడి చేస్తున్నారు. 

అభిమానం ఉండొచ్చు కాని అది హద్దులు మీరితే ఇలాంటి పైత్యాలే బయటకు వస్తాయి. గతంలో కూడా హీరోయిన్లను అభిమానులు ఆరాధించడం చూశాం. తమిళనాటనే ఈ సాంప్రదాయాం ఎక్కుగా ఉంది.  తమిళ స్టార్ హీరోయిన్లు కుష్బూ, నయనతార, సమంత లకు గుడి కట్టి తమ అభిమానాన్ని అతిగా చూపించుకన్నారు.. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ కు కూడా ఇలానే గుడికట్టారు రీసెంట్ గా. అయితే గతంలో కూడా సూపర్ స్టార్ కు అభిమానులు గుడి కట్టారు.. కాని ఈసారి మరో అభిమానిఇంకాస్త ముందడుగు వేసి.. నిత్యపూజలు, హారతులు..అభిషేకలాలతో బ్రతికున్న వ్యక్తిని దేవుని చేశారు. 

 

 అక్కడి పూజలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మూఢ భక్తుడు ఎక్కడ ఉన్నాడంటే..మధురైకి చెందిన కార్తీక్ అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు. విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నాడు. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయాడు కార్తీక్. 

ఈ అభిమాని గురించి రజనీకాంత్ వరకు చేరిందో లేదో తెలియదు కానీ ఇతని గుడి, పూజలు మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కాగా రజనీకాంత్ తాజాగా లీడర్ 170 మూవీతో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ముంబయిలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లీడర్ 170 సినిమా 2014 సమ్మర్‌కి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios