సూపర్ స్టార్ రజినీ బర్త్ డే స్పెషల్.. వైరల్ సాంగ్ అదిరింది

superstar rajinikanth birthday special song
Highlights

  • ఇవాళ సూపర్ స్టార్ రజినీ పుట్టినరోజు
  • రజినీ పుట్టిన  రోజు సందర్భంగా పలు చోట్ల సంబరాలు
  • స్పెషల్ ఎట్రాక్షన్ గా రజినీ బర్త్ డే కోసం ఎస్.ఆర్.రామ్ రూపొందించిన సాంగ్

సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రజినీ అభిమానులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తలైవా రజినీ రహస్య ప్రదేశంలో వున్నా... అభిమానులు మాత్రం పుట్టినరోడు వేడుకలు జరుపుకుని సంబరాల్లో మునిగితేలారు. ఇక ఈ సంబరాల్లో ప్ర‌ముఖ మ్యుజీషియ‌న్ ఎస్.ఆర్ రామ్ త‌లైవా ర‌జినీకాంత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ సాంగ్‌ రూపొందించారు. వా వా వా తలైవా అంటూ సాగే పాట ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. రజినీకాంత్ భార్య ల‌తా ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా ఈ పాట విడుద‌లయింది. బాలాజీ, శ్రీదేవి పాట పాడ‌గా, శిబిరాజా డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. మ‌రి ఎస్ఆర్ రామ్ సంగీతంలో రూపొందిన స్పెష‌ల్ సాంగ్‌ మీరు కూడా చూసేయండి

 

loader