ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్, బాబా న్యూ ట్రైలర్ రిలీజ్, తలైవా ఫ్యాన్స్ కు పండగే
ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ . తన మూవీ కెరీర లో చాలాస్పెషల్ అనిపించుకున్న బాబా సినిమాను రీ రిలీజ్ చేయబో్తున్నారు మేకర్స్. తలైవా బర్త్ డే సందర్భంగా ఈమూవీ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. రీసెంట్ గా ఈమూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్.

ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ సినిమా చేస్తున్నాడు తలైవా. ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతున్న వేళ.. సూపర్ స్టార్ అభిమానులను దిల్ ఖుష్ చేసేలా.. ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తమిళ స్టార్ హీరో కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీగా.. ఆయన జీవితానికి కాస్త దగ్గరగా అనిపించిన సినిమా బాబా. ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
20 ఇయర్స్ వుతుంది బాబా సినిమా రిలీజ్ అయ్యి.. ఇక ఈ సందర్భంతో పాటు.. సూపర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయన జీవితానికి దగ్గరగా ఉండే బాబా సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అంతే కాదు మరో శుభవార్త ఏంటీ అంటే..? ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా బెస్ట్ క్వాలిటీతో ఈ సినిమాను రీఎడిట్ కూడా చేశారు. రీసెంట్ గా రజనీ కాంత్ ఈసినిమాకు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు.
సురేశ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన బాబా చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రజనీ అభిమానులతో పాటు.. ఆడియన్స్ అందరిని ఈ మూవీ నిరాశపరిచింది. ఇక కాస్త అటూ ఇటు తేడాతో.. కొత్త వెర్షన్‌లో బాబాను విడుదల చేయబోతున్నారు మేకర్స్ . అంతే కాదు బాబా మూవీ సాంగ్స్ ను డోల్బీ మిక్స్ సౌండ్‌తో రీమాస్టర్డ్ వెర్షన్ సిద్దం చేస్తున్నట్టు సమాచారం. తలైవా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫ్యాన్స్ ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే కేవలం తమిళంలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రీ-రిలీజ్ చేశారు
లేటెస్ట్‌గా రిలీజైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టు బాబా ట్రైలర్‌ను అద్భుతంగా రీ ఎడిట్ చేశారు. ఈ ట్రైలర్ తో అభిమానుల్లో బాబా సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే పాత సినిమాలో కొన్ని కొత్త సీన్స్ ను కూడా ఆడ్ చేసినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సూపర్ నేచురల్ యాక్షన్ ఫిలిమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకు జోడీగా మనీషా కొయిరాల నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లోటస్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మించారు.
2002 లో రిలీజ్ అయిన బాబా సినిమా మంచి బడ్జెట్‌తో తెరకెక్కింది. కాని ... భారీ అంచనాలను అందుకోలేక చతికలపడింది. దాంతో ఈమూవీ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్‌లకు నష్టాల్ని తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్ కొత్తదే అయినా, కథనం బోరింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. అయితే తన వల్ల వాళ్ళు నష్టపోవడంతో బాధపడ్డ రజనీకాంత్ డిస్ట్రీబ్యూటర్స్ ను తానే స్వయంగా ఆదుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే అది హిట్.. ప్లాప్ అని లేదు. అన్నింటికి అతీతంగా ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా.. రజనీ ఉన్నాడన్న కారణంతో ఆ మూవీకి హైప్ ఇస్తారు. ఫ్యాన్స్ కూడా తలైవా ప్రతీ మూవీని నెత్తిన పెట్టుకుని మోస్తుంటారు. ఇప్పుడు బాబా సినిమాను కూడా రికార్డ్ బ్రేక్ అయ్యేలా చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారట తలైవా భక్తులు. ఇటు తెలుగు ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.