సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘ఎస్ఎస్ఎంబీ 28’ రూపుదిద్దుకుంటోంది. చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుందనే తరుణంలో మహేశ్ బాబు ఫ్యామిలీతో వేకేషన్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
స్టార్ హీరో మహేశ్ బాబు సినిమాల పరంగా ఎంత శ్రద్ధగా ఉంటారో.. ఇటు ఫ్యామిలీతోనూ సమయం గడిపేందుకు ఎక్కువగా టైం కేటాయిస్తుంటారు. మామూలుగానే మహేశ్ బాబు ఏడాదికి నాలుగైదు సార్లు వేకేషన్ కు వెళ్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా విదేశాల్లో వాలిపోతుంటారు. రీసెంట్ గా భార్య నమ్రతా.. పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, సితారాతో కలిసి లండన్ కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత తల్లి, తండ్రి క్రిష్ణ మరణంతో ఫ్యామిలీ మొత్తంగా శోకసంద్రంలో నిండిపోయింది. ఓకే ఏడాదిలో అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి క్రిష్ణను కోల్పోవడం మహేశ్ కు గుండెల నిండ బాధను నింపింది.
ఇప్పుడిప్పుడే పెట్టెడు శోకం ననుంచి బయటపడుతున్నారు. మరోవైపు మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘ఎస్ఎస్ఎంబీ 28’ సినిమా రూపుదిద్దుకుంటోంది. మహేశ ఇంట వరుస విషాధాలతో షూటింగ్ కు బ్రేక్ పడుతూ వచ్చింది. గత నెలలో క్రిష్ణ చనిపోవడంతో మళ్లీ ఆగిపోయింది. దీంతో మళ్లీ షూటింగ్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. సినిమాతోనే మహేశ్ బాబు బిజీగా ఉంటారని అంతా భావిస్తుండగా.. తాజాగా ఎయిర్ పోర్టులో ఫ్యామిలీతో కనిపించి షాకిచ్చారు. మరో వేకేషన్ కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈసారి ఎన్నిరోజులు టూర్ ప్లాన్ చేశారో తెలియడం లేదు. ఇక మహేశ్ బాబు ఎప్పుడు తిరిగి వస్తారో.. ఎప్పుడు షూటింగ్ మొదలెడుతారోనన్ని ఆసక్తికరంగా మారింది.
‘ఎస్ఎస్ఎంబీ 28’కు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం థమన్ ఇటీవల దుబాయ్ కి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి మొదట వారంలోనే రెండో షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ గ్యాప్ లోనే వేకేషన్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈసారి స్టార్ట్ చేస్తే లాంగ్ షెడ్యూల్ తో పూర్తి చేయాలని భావిస్తున్నారంట. ఇక SSMB28లో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తోంది. హరిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరోవైపు జనవరి 7న మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’ రీరిలీజ్ కాబోతోంది.
