సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇటీవల థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్ ఇప్పుడు బట్టల వ్యాపారంలోకి దిగారు. మహేష్ బాబు సొంతంగా ఓ బ్రాండ్ స్థాపించనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ తన క్లోతింగ్ బ్రాండ్ ని 
మహేష్ బాబు ప్రకటించారు.

'ది హంబల్ కో' పేరుతో గార్మెంట్ బ్రాండ్ ను మహేష్ స్థాపించారు. ఆగస్ట్ 7న దీన్ని మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికంగా మహేష్ ప్రకటించారు. 'మా హంబల్ ప్రయత్నాన్ని ఈరోజు ప్రకటిస్తున్నాం.. అధ్బుతంగా స్పందించిన అందరికీ కృతజ్ఞతలు.. ది హంబల్ కో.. కేవలం క్లోతింగ్ మాత్రమే కాదు.. ఇదొక జీవన విధానం.. ది హంబల్ ఫ్యామిలలో మీ అందరికీ వెల్కమ్' అంటూ పోస్ట్ పెట్టాడు మహేష్.  

కంపనీ లోగో, కొత్త దుస్తుల్లో మహేష్ లుక్ ని కూడా విడుదల చేశారు. 'The HUMBL co' అనే లోగోలో 'MB' అనే లెటర్స్ ని అండర్ లైన్ చేశారు. అంతే మహేష్ బాబు అర్ధం వచ్చే విధంగా లోగోను డిజైన్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కాశ్మీర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది.

త్వరలోనే హైదరాబాద్లో వేసిన సెట్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.