Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్టార్ రజినీకాంత్ దూకుడు.. లైన్ లో 4 సినిమాలు, తగ్గేది లేదంటున్న తలైవా..

సూపర్ స్టార్ రజినీకాంత్ దూసుకుడు మీద ఉన్నారు. వరుసగా సినిమాలు తెరకెక్కించడంతో పాటు.. కొత్త సినిమాలు లైన్ అప్ చేస్తున్నారు. అంతే కాదు ఈ వయస్సులో కూడా ప్రయోగాలకుపెద్ద పీట వేస్తున్నారు తలైవా. 
 

Super Star Rajinikanth lining up 4 movies with young directors JMS
Author
First Published Jan 10, 2024, 12:40 PM IST

తగ్గేది లేదంటున్నారు తలైవా.. జైలర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రజినీకాంత్.. 73 ఏళ్ల వయస్సులో దూసుకుపోతున్నారు. ఇక రజినీకాంత్ పని అయిపోయింది అన్నవారి నోర్లు మూతపడేలా.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యేలా జైలర్ తో సమాధానం చెప్పిన సూపర్ స్టార్.. ఇక తన నెక్ట్స్ మూవీస్ కూడా అంతే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన స్టార్ సీనియర్ హీరో..కుర్రహీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు. తలైవా తగ్గేది లేదంటున్నారు. 

సూపర్‌స్టార్ రజనీకాంత్.. 73 ఏళ్ల వయస్సులో కూడా తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.వచ్చే ఏడాదికి అంటే  2025లో తలైవా.. తన 50 సవంత్సరాల సినీజీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఏడు పదుల వయస్సులో కూడా  అభిమానులు ఇలా ఆనందపరచడం ఒక్క రజినీకే చెల్లింది. అంతే కాదు ఈ ఏజ్ లో తలైవా.. యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశం ఇస్తూ.. వాళ్లకు లైఫ్ ఇస్తున్నారు. వాళ్లలో టాలెంట్ ను బయటకు తీసి.. వారి చేత ప్రయోగాలు చేస్తూ.. 73 ఏళ్ల వయసులో తాను  కూడా  ప్రయోగాలు చేస్తున్నాడు రజినీకాంత్. 

హీరోగా మహేష్ బాబు మరో మేనల్లుడు, కొడుకు ఎంట్రీపై సుధీర్ బాబు క్లారిటీ..

యంగ్ డైరెక్టర్స్ కు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ..  వరుసగా చాలా సినిమాలకు సైన్ చేస్తున్నాడు రజినీకాంత్. ఇప్పటికే ఆయన రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. మరో దర్శకుడికి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తలైవా తాజాగా  దర్శకుడు మారి సెల్వరాజ్ కు గ్రీన్ సిగ్నల్ఇచ్చాడట  తన 172వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడని సమాచారం.  7 స్క్రీన్ స్టూడియో తరపున లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలుస్తుంది. సెల్వరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్ తొలిసారి కలవబోతున్నారు. 

అంతే కాదు జైలర్ సినిమాతో బాక్సాఫీస్ బాక్సులు మోత మోగించిన నెల్సన్ దిలీప్ కుమార్ తో  సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి అంతకు మించి సినిమా చేయాలని అనుకున్నారట. మరో విషయం ఏంటంటే.. రూమర్స్ ప్రకారం  జైలర్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ గా రాబోతున్నట్టు  ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. 

ఇక తలైవా  174వ సినిమాకు  ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి కార్తీక్  వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. తలైవాతో డిఫరెంట్ సినిమా ప్లాన్ చేస్తున్నారట కార్తీక్. ఇక ఇవి అఫీషియల్ గా అనౌన్న్ చేయాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios