దర్శకుడు శివ అంటే ఎక్కువగా అజిత్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ఇటీవల శివ ఎక్కువగా అజిత్ తోనే వరుసగా చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇటీవల అజిత్, శివ కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వాసం చిత్రం ఘనవిజయం సాధించింది. దీనితో సూర్య లాంటి స్టార్ హీరోలు సైతం శివ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. శివ నెక్స్ట్ మూవీ సూర్యతో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా శివ మరో బంపర్ ఆఫర్ అందుకున్నాడట. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల విశ్వాసం చిత్రాన్ని వీక్షించి శివని తన ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సినిమా అద్భుతంగా తీశావని రజనీ ప్రశంసలు కురిపించారట. వీరి మధ్య గంటకు పైగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తన కోసం ఓ కథ సిద్ధం చేయవలసిందిగా రజనీకాంతే స్వయంగా శివని అడిగాడట. 

సూపర్ స్టార్ అంతటివాడే రిక్వస్ట్ చేస్తే ఏ దర్శకుడైనా కాదంటాడా.. త్వరలో ఓ కథ రెడీ చేసి వినిపిస్తానని శివ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రజనీ, శివ కాంబినేషన్ లో ఓ మాస్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని ఆశించవచ్చు.