హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం పూర్తిగా కుదటపడనట్లుగా తెలుస్తోంది. చెన్నై నుంచి ఆయన వ్యక్తిగత డాక్టర్ బయల్దేరారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ ‌చేరుకోనున్నారు.

అటు రజనీ కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఆయన బీపీ సైతం పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో రేపు కూడా రజనీకాంత్‌కు అపోలోలో చికిత్స అందించనున్నారు. రేపు ఆయనకు మరిన్ని పరీక్షలు చేసే అవకాశం వుంది.

ప్రస్తుతానికి రజనీ కుమార్తె ఐశ్వర్య మినహా ఎవ్వరినీ ఆయన దగ్గరకు వైద్యులు అనుమతించడం లేదు. ఐశ్వర్యతో మెగాస్టార్ చిరంజీవి ఫోన్ ద్వారా సంభాషించారు. రజనీ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థ పాలైన సంగతి తెలిసిందే. అన్నాత్తే మూవీ షూటింగ్లో రజినీ కాంత్ పాల్గొనడం జరిగింది. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్న ఎనిమిది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో రజిని కాంత్ సైతం కోవిడ్ టెస్ట్స్ చేయించుకున్నారు.

ఆయనకు కోవిడ్ నెగిటివ్ అని రిజల్ట్ రావడం జరిగింది. అయినప్పటికీ ఆయన అనారోగ్యంగా కనిపించడంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ మేరకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి.