తగ్గేదే లేదంటున్న రజినీకాంత్ మనవడు, సూపర్ స్టార్ ను దింపేశాడుగా..
తాతకుతగ్గ మనవడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్ మనవడు.. స్టార్ హీరో ధనుష్ - ఐశ్వర్యల చిన్న తనయుడు లింగ. ఇంతకీ అతను ఏం చేశాడంటే..?
సూపర్ స్టార్ మనవళ్లు తక్కువోళ్ళు కాదు.. తాతకుతగ్గ మనవళ్లు అనిపించుకుంటున్నారు. రజినీకాంత్ కుతురు దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ ,ధనుష్ లకు ఇద్దరు కొడుకులు. వారిలోమొదటి వాడు యాత్ర ధనుష్.. హీరోలా తయారయ్యాడు. త్వరలో అతని ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు వైరల్ అవుతుండగా.. ఈలోపు రెండో తనయుడు లింగా వైరల్ అవుతున్నాడు. మనోడి కాన్ఫిడెంట్ .. ఆఏజ్ కే ఏమాత్రం బెరుకు లేకుండా కొన్ని వేల మంది ముందు తాతను ఇమిటేట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన జైలర్ సినిమాతో సాలిడ్ కంమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కూతురు దర్శకత్వంలో సూపర్ స్టార్ ఓ సినిమా చేస్తున్నారు. లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రజనీ. ‘లాల్ సలామ్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ భార్య లత, కూతురు ఐశ్వర్య, రెండో కూతురు సౌందర్య కూడా పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ లో అంత మంది ముందు రజనీకాంత్ యాక్షన్ ని కాపీ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. వేల మంది ముందు ఈ చిన్నోడు చేసిన యాక్టింగ్ చూసి అంతా షాక్ అయ్యారు. అంతే కాదు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘లాల్ సలామ్’ సినిమాలో రజనీ ముత్తు స్టైల్ లో సెల్యూట్ చేస్తూ కనిపించాడు ఆ బుడతడు. ఇక ఫ్యూచర్ హీరో అంటూ రజినీఫ్యాన్స్ వరుసగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. సూపర్ స్టార్ బ్లడ్ కదా.. నటన అందులోనే ఉంటుంది. అని పొగిడేస్తున్నారు. ఈ చిన్నోడి కాన్ఫిడెంట్ కుముచ్చటేస్తోంది అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.