సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు గురించి అందరికి తెలిసిందే. ఆయనకు ఎంత డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారో కూడా తెలుసు. ఈక్రమంలో తలైవా ఫ్యాన్స్ అప్పుడప్పుడు ఆయనపై అభిమానాన్ని రకరకాలుగా వెల్లడిస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ బర్త్ డే కోసం వారు ఏం చేశారంటే..? 

మొదటి నుంచి సినిమా తారలు..ముఖ్యంగా హీరోలపై అభిమానులు ప్రేమ ఎలా ఉంటుందో ఎన్నో ఉదాహరణలు చూశాం.. చూస్తూనే ఉన్నాం తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు అర్పించిన అభిమానులు కూడా ఉన్నారు. అయితే స్టార్స్ మాత్రం మా కోసం ఇలా చేయడండి అని చెప్పడం లేదు.. అభిమానం గుండెల్లో ఉంటే చాలు.. అతిగా వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అంటూ ఎప్పుడూ వేడుకుంటూనే ఉంటారు. అజిల్ లాంటి స్టార్స్ అయితే..అభిమాన సంఘాలనే కాన్సిల్ చేసి పడేశారు. ఇక తమిళ నాట మాత్రమే కాకుండా.. దేశ మంతా అభిమానులు ఉన్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. నిన్న (డిసెంబర్ 12) సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు కాండంతో రకరకాలుగా తమ అభిమానానని చాటుకున్నారు. 

ఫ్యాన్స్ కు రజినీకాంత్ బర్త్ డే గిఫ్ట్.. తలైవా 170 మూవీ నుంచి టైటిల్ టీజర్ రిలీజ్...

73 ఏళ్ళ వయసులో కూడా అభిమానులను అలరిస్తూ.. కష్టపడుతున్నారు రజినీకాంత్. ఆయన పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ బర్త్ డే అంటే అభిమనులకు పండగే.. అందుకే పలువురు అభిమానులు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారు. తమిళనాట వరదలు కావడంతో.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం రజినీకాంత్ కోసం కట్టిన గుళ్లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి స్పెషల్ పూజలు నిర్వహించారు.

Scroll to load tweet…

మధురైకి చెందిన కార్తీక్ అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు. విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నాడు. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయాడు కార్తీక్. తాజాగా రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా పాలాభిషేకం చేశాడు భక్తుడు. ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. 

నాగార్జున, బాలయ్య, విశ్వక్ సేన్ ఇప్పుడు మనోజ్ వెండితెరపై హీరోలు, బుల్లితెరపై హోస్ట్ లు, సత్తా చాటిన స్టార్స్

ఈ అభిమాని గురించి రజనీకాంత్ వరకు చేరిందో లేదో తెలియదు కానీ ఇతని గుడి, పూజలు మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కాగా రజనీకాంత్ తాజాగా లీడర్ 170 మూవీతో బిజీగా ఉన్నారు. తలైవా బర్త్ డే సందర్భంగా ఈమూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈమూవీలో అమితాబ్ బచ్చన్‌ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా 2014 సమ్మర్‌కి రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.