అయోధ్య బయలుదేరిని మాజీ మామా అల్లుడు, రజినీకాంత్, ధనుష్ ఎయిర్ పోర్ట్ వీడియోలు వైరల్
ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు అయెధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆయెధ్యలో భారీ ఏర్పాట్లు జరగ్గా.. స్టార్స్ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ అయోధ్య ప్లైట్ ఎక్కేశారు.
దేశ వ్యాప్తంగా భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామందిర కల నెరవేరబోతుంది. రేపు ( జనవరి 22)న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చెక చెకా చేస్తున్నారు. ఈక్రమంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో సెలబ్రిటీలు హాజరవుతుండగా.. లక్షల్లో సామాన్య ప్రజలు హాజరుకాబోతున్నారు. నలుమూల నుంచి, ఇతర దేశాల నుంచి కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యకు రానున్నారు. ఇప్పటికే అయోధ్యలో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.
జై శ్రీరామ్ అంటూ.. కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టా మహోత్సవం జరగబోతోంది. ఈకార్యకక్రమం కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. అందరూ తరళి వెళ్తున్నారు. కొన్ని వేల మంది సెలబ్రిటీలు అద్భుతంలో పాలు పంచకోబోతున్నారు. లక్షల్లో భక్తులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు మన సినీరంగం తో పాటు.. అన్ని రంగాల నుంచి కార్యక్రమానికి దాదాపుగా దాదాపు 8 వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ఆహ్వానాలు అందాయి.
సినిమా ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, చిరంజీవి, అమితాబ్, చరణ్, ఎన్టీఆర్, ధనుష్, రుషబ్ శెట్టి, ఆలియా భట్, రణ్ బీర్, దీపికా, ఇలా సినిమా స్టార్స్ అందరికి ఆహ్వానాలు అందాయి. కాగా సెలబ్రిటీల రాకతో ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం అయోధ్యకు చేరుకున్నారు. ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా అయోధ్య బాట పడుతున్నారు. తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, తమిళ హీరో ధనుష్ కూడా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి అయోధ్యకు బయలుదేరారు. రజినీకాంత్, ధనుష్ చెన్నై ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.