సూపర్ స్టార్ మహేష్ , మురుగదాస్ కాంబినేషన్ లో స్పైడర్ స్పైడర్ చిత్రానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రసంసలు ప్రత్యేకంగా షోని తిలకించిన సూపర్ స్టార్ రజినీకాంత్

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబపడుతోంది. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు. 

'స్పైడర్‌' చిత్రం గురించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ''సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'స్పైడర్‌'లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ నా అభినందనలు'' అన్నారు. 

మరోవైపు మహేష్ బాబుకు ప్రధాని నరేంద్రమోదీ ఆఫీస్‌ నుండి ఫోన్ వచ్చింది. స్పైడర్ సినిమా ను చూసి అప్రిసియేట్ చేయడానికి కాదు.. కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం మాదిరిగానే రాష్ట్రంలో నవంబర్ నెలలో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్, గోవా లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుపనున్న విషయం తెలిసిందే..ఆ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఇన్ వైట్ చేయనున్న అతిధుల జాబితాలో మన స్పైడర్ బాబుకూడా ఉన్నట్లు తెలుస్తోంది . ఇందులో భాగంగానే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), సెన్సార్ బోర్డు అధికారులు ఇటీవల ప్రిన్స్ మహేశ్‌ను కలిసి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందని తెలుస్తోంది. అయితే త్వరలో గోవా లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కూడా జరనున్న నేపథ్యం లో మహేష్ ని ఏ ఫెస్టివల్ కి ఆహ్వానించారనే దానిపై క్లారిటీ రావాల్సివుంది.