మీరు విజయం సాధించాలి... సీఎం జగన్ కి మహేష్ బర్త్ డే విషెస్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన విజయాలు సాధించాలని కోరుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 1972 డిసెంబర్ 21న జన్మించిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 51 వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా హీరో మహేష్ బాబు సీఎం జగన్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ''గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. మీకు విజయం దక్కాలి'' అని కామెంట్ పోస్ట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్ వైరల్ అవుతుంది. సీఎం జగన్ ని మహేష్ విష్ చేయడంతో మ్యూచ్వల్ ఫ్యాన్స్ పండగ ఆనందం వ్ వ్యక్తం చేస్తున్నారు.
వై ఎస్ జగన్-మహేష్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితంగా ఉండేవారు. ఆ బాండింగ్ మహేష్-జగన్ మధ్య కూడా డెవలప్ అయ్యింది. గత ఏడాది కృష్ణ కన్నుమూయగా వై ఎస్ జగన్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా... మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి.