ఇకపై UPI చేస్తే మహేష్ బాబు వాయిస్ వస్తుంది, స్మార్ట్ స్పీకర్ లో సూపర్ స్టార్ గొంతు..
ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకంటే.. కమర్షియల్ యాడ్స్ తో బాగా సంపాదిస్తున్నారు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఏడాదికో సినిమా చేస్తారు మహేష్ బాబు.. కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోతే.. ఆ సినిమా కూడా ఉండదు. కాని కమర్షియల్ యాడ్స్ మాత్రం ఎన్నైనా చేస్తారు. ఇది అది అని లేదు.. ఆయన ఇప్పటివరకూ చేసిన యాడ్స్ లెక్కపెట్టలేము అన్ని చేశారు. అయితే అలా అని ఆయనకు డబ్బు పిచ్చి ఏమీ లేదు. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన కోట్ల రూపాయలను ఆయన చిన్నారుల వైద్యానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ లోకి మరొకటి వచ్చి చేరింది.
ప్రస్తుతం 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు.. తాజాగా మరోకటి యాడ్ చేసుకున్నారు. ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్‌పే (Phone Pe) స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతుని ఇస్తున్నారు. ఫోన్ పే నుంచి మనీ సెండ్ చేసినప్పుడు.. మనీ రీసివ్డ్ అంటూ ఓ వాయిస్ వస్తుంది కదా..? ఆ వాయిస్ కంప్యూటర్ జెనెరేటెడ్ వినిపించేది గతంలో. కాని ఇప్పుడు ఆ వాయిస్ కి బదులు మహేష్ బాబు వాయిస్ వినిపించబోతుంది. ఇందుకోసం మహేష్ వాయిస్ తో కొన్ని శాంపిల్స్ తీసుకోని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారు.
ఇక నుంచి కొత్త ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో మీ నగదు లావాదేవీలు మహేష్ బాబు వాయిస్ తో వినవచ్చు. కాగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్ తో కూడా ఫోన్‌పే లావాదేవీలు వినిపిస్తూ మార్కెట్ లోకి వచ్చింది. అయితే అలా అమితాబ్ వాయిస్ వినిపించినందుకు కొంత డబ్బుని ఛార్జి లెక్క జమ చేసుకుంటున్నట్లు కొందరు వ్యాపారాలు చెబుతున్నారు. మరి ఇప్పుడు మహేష్ వాయిస్ కూడా అలాగే ఛార్జి చేస్తారా లేదా అనేది చూడాలి.
ఇక సూపర్ స్టార్ మహేష్ రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పొంగల్ హిట్ గా నిలిచింది. ఇక నెక్ట్స్ టాలీవుడ్ జక్కన్న.. పాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈసినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియన్ భామ మహేష్ సరసన నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ అడ్వెంచరస్ మూవీగా ఇది తెరకెక్కుతున్నట్టు సమాచారం.