మహేష్ బాబు కొత్త లుక్ చూశారా..? కుక్కపిల్లను ముద్దు చేస్తున్న సూపర్ స్టార్...

సరికొత్త అవతారంలో కనిపించారు టాలీవుడ్ సూపర స్టార్ మహేష్ బాబు. అభిమానుల కళ్లను నమ్మలేని విధంగా.. మహేష్ బాబు యంగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

super Star Mahesh Babu New Look Viral In social Media JMS


సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుక్కపిల్ల స్నూపీతో ఆడుకుంటున్నాడు. ఆ కుక్కను ముద్దు చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ మరో విశేషం ఉంది. మహేష్ బాబు కుక్కతో ఆడుకుంటున్నాడు అని కొంత మంది విచిత్రం  చూస్తుంటే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కళ్లు మాత్రం మహేష్ న్యూ లుక్స్ పై పడ్డాయి. ఆయన స్టైలీష్ హెయిర్స్ స్టైల్.. ఫేస్ లో కొత్త మార్పును గమనిస్తున్నారు అభిమానులు. 

ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్. ఎప్పటికప్పుడు సినిమాకు తగ్గట్టుగా తనను తాను మారిపోవడంలో మహేష్ రూటే వేరు. 50 ఇయర్స్ కు రెండేళ్ళ దూరంలో ఉన్నాడు మహేష్ బాబు. కాని ఇప్పటికీ కాలేజీ కుర్రాడు అంటే నమ్మే విధంగా మెయింటేన్ చేస్తుంటాడు. తాజాలుక్స్ లో టీనేజ్ కుర్రాడిలా కనిపించాడు మహేష్. ఈఫోటోలు ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. హేష్ సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. కానీ ఇటీవల అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు జోష్ ఇస్తున్నాడు. ఎక్కువగా తన జిమ్ ఫోటోలు షేర్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు మహేష్.

తాజాగా మహేష్ తన పెంపుడు కుక్కని ఎత్తుకొని ఫోటోని షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. మహేష్ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు(Dog) ఉండగా అందులో ఒకటి రీసెంట్ గా మరణించింది. దాంతో మరో కొత్త కుక్కని తీసుకొచ్చి కూతురు సితారకు గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్.  దానికి స్నూపీ అని పేరు పెట్టారు. తాజాగా మహేష్ స్నూపీని ఎత్తుకొని దిగిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 

అయితే మహేష్ కుక్కని ఎత్తుకున్న ఫొటో వైరల్ అవ్వడం కంటే మహేష్ కొత్త లుక్ మరింత వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో మహేష్ ఎక్కువ జుట్టు పెంచుకొని, హెయిర్ వెన్కక్కి వేసుకొని హెడ్ బ్యాండ్ పెట్టుకోవడంతో .. ఫ్యాన్స్  ఈ లుక్ బాగుందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే గుంటూరు కారం షూటింగ్ ఆల్ రెడీ అయిపోవచ్చింది. మరి సూపర్ స్టార్ ఈ లుక్స్ ను ఎందుకోసం చేశాడో తెలియడం లేదు.తనకు ఇష్టమైన ఇలా పెంచాడా..? లేక జక్కన్న సినిమా ఫోటో షూట్ కోసం ఇలా చేశాడా అని డౌట్ వ్యక్తం అవుతోంది. 

ప్రస్తుతం గుంటూరు కారం చేస్తున్న మహేష్.. ఆతరువాత పాన్ ఇండియా డైరెక్టర్ .. టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో.. పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈసినిమా అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈమూవీలో హాలీవుడ్ హీరోలా కనిపించబోతున్నాడట మహేష్ బాబు. పక్క ప్రాణాళికతో రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈమూవీ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios