వంశీకి 40 ఏళ్లు అంటే.. 20 ఏళ్లే.. మహేష్

super star mahesh babu birthday wishes to director vamsi
Highlights

డైరెక్టర్ వంశీ పైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేష్

సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ రోజు 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్ డే విషెస్ చెప్పిన వారిలో మహేష్ బాబు కూడా ఉన్నారు. వంశీ యంగ్‌ దర్శకుడని మహేశ్‌ అన్నారు. ‘40 ఏళ్ల యంగ్‌ దర్శకుడు, నా స్నేహితుడు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అనుమానం లేదు.. 40 ఏళ్లంటే 20 ఏళ్లే. యంగ్‌గా, ఆనందంగా జీవించండి’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు వంశీ దర్శకత్వంలో వస్తోన్న తన తర్వాతి సినిమా సెట్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో మహేశ్‌, వంశీ నడుస్తూ నవ్వుతూ కనిపించారు.

‘బహుముఖ ప్రతిభ ఉన్న దర్శకుడు, నా స్నేహితుడు, శ్రేయోభిలాషి వంశీ పైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు గొప్పగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా’ అని హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు.

మహేశ్‌ 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
 

loader