సూపర్ ఓవర్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ భావోద్వేగంగా మారిపోయింది. చిత్ర యూనిట్ లో భాగమైన ప్రవీణ్ అనే వ్యక్తిని తలచుకొని హీరోయిన్ చాందినీ చౌదరి, హీరో నవీన్ చంద్ర కన్నీటి పర్యంతరం అయ్యారు. సూపర్ ఓవర్ మూవీ తెలుగు ఓటిటి యాప్ ఆహాలో జనవరి 22నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. హీరో హీరోయిన్స్ తో పాటు దర్శకుడు సుధీర్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కాగా సూపర్ ఓవర్ మూవీకి మొదట దర్శకత్వం వహించిన ప్రవీణ్ ని తలచుకొని కన్నీరు పెట్టుకున్నారు చిత్ర యూనిట్. సూపర్ ఓవర్ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ వర్మ కాగా, చిత్రీకరణ సమయంలో కారు ప్రమాదంలో ప్రవీణ్ మరణించారు. ప్రవీణ్ గతంలో సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. దీనితో సూపర్ ఓవర్ చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యత సుధీర్ వర్మ తీసుకోవడం జరిగింది. 

ప్రవీణ్ మరణం తమను ఎంతగానో కలచి వేసిందని, ఒక వ్యక్తి కల సాకారం చేయడానికి సూపర్ ఓవర్ మూవీ పట్టుదలతో పూర్తి చేశామని నవీన్ చంద్ర అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చాందిని చౌదరి.. సూపర్ ఓవర్ సెట్స్ లో ప్రతిరోజూ ప్రవీణ్ గుర్తుకు వచ్చేవారు.  ఆయన ఎక్కడ ఉన్నా ఈ మూవీ చూసి సంతోషిస్తారని ఆమె అన్నారు. ఇక క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా సూపర్ ఓవర్ తెరకెక్కింది.