ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో పాటు.. ఊపునిచ్చే పాటలు కూడా సందడి చేశాయి. యూటుబ్యర్స్ పండగచేసుకునే విధంగా.. మ్యూజిక్ లవర్స్ దిల్ ఖుష్ అయ్యే విధంగా టాలీవుడ్ నుంచి వచ్చిన పాటలెంటి.. సూపర్ హిట్ అయిన సాంగ్స్ ఏంటో చూద్దాం..
2024 కు గ్రాండ్ వెల్కం చెప్పడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అలాగా 2023ని కూడా గుర్తు చేసుకుంటూ.. ఈ ఏడాది జరిగిన తీపి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈక్రమంలో ఈ ఏడాది కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఇండస్ట్రీని ఊపు ఊపేశాయి. మరి వాటిలో జనాల మధ్య బాగా నలిగి.. రీల్స్ గా రఫ్పాడించిన పాటలేంటో చూద్దాం.
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి అదరిపోయే సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ప్రస్తుతానికి అదే పాట ట్రెండింగ్ లో ఉంది. కూర్చి మడతపెట్టి.. అంటూ.. యూత్ ను ఊర్రూతలూగిస్తున్న ఈపాట వివాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. పాటలో బూతులుఎక్కువయ్యాయంటూ ఫీల్ అవుతున్నారుఅభిమానులు. ఇక ఈపాటకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ లేనంతగా డాన్స్ ఇదరగదీసిండు. అంతే కాదు బాబుకు జోడీగా శ్రీలీల ఎక్కడా తగ్గేతేలే అన్నట్టు దంచ్చికొట్టింది. ఇక ఈమూవీ షూటింగ్ అయిపోయింది.. ఇక సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇక ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్ లో విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఖుషి సినిమా పాటలన్నీ చేరాయి. మొలోడీతో మోస్మరైజ్ చేశాయి ఖుషీ పాటలు. ఎన్ని సార్లు విన్నా వినాలనిపించేలా ఖుషి పాటలు.. ఆడియన్స్ హృదయాలను దోచేశాయి. మీరీ ముఖ్యంగా ఆరాధ్య పాటతో పాటు.. ఖుషీ టైటిల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను లాగేస్తున్నాయి.

ఇక ఈ ఏడాది బాలయ్య నుంచి వచ్చిన రెండో సినిమా భగవంత్ కేసరి. ఈమూవీలో ఫాదర్ సెంటిమెంట్ తో సాగే.. ఉయ్యాలో ఉయ్యాల సాంగ్ సాంగ్ శ్రోతను తన్మయత్వానికి గురిచేసింది.

ఇక ఈక్రమంలో మొదటి నుంచి హిట్ పాటల గురించి చూసుకుంటే బాలయ్య బాబు ఈ ఏడాది సంక్రాంతి కి హిట్ కొట్టిన సినిమా వీరసింహారెడ్డి. ఈమూవీలో జై బాలయ్య పాట మామూలు హిట్ అవ్వలే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సందర్భం ప్రకారం ఈ పాటను తెగ వాడేస్తున్నారు. నెటిజన్ల దగ్గర నుంచి టెలివిజన్ షోల వరకూ.. జై బాలయ్య అటు పూనకాలు తెచ్చుకున్నాడు యూత్. ఈ పాట 4 కోట్ల వ్యూస్ దాటేసింది. ఇక ఇదే సినిమాలో హనీరోజ్ అభినయించిన మా బావ మనోబావాలు పాట కూడా 2కోట్ల వ్యూస్ తో టాప్ లో నిలిచింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది కొట్టిన ఏకైక హిట్టు వాల్తేరు వీరయ్య. ఈమూవీలో పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఈమూవీకి దేవిశ్రీ ఇచ్చిన సంగీతం అంతా ఇంత కాదు. బాస్ పార్టీ అంటూ పూనకాలు లోడింగ్ సాంగ్ మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగించింది.

ఇక ఈ ఏడాది సూపర్ హిట్ సాంగ్స్ లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని కూడా చేరిపోయారు. నాని దసర సినిమాలో రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా చెమ్కీలా అంగీలేసి.. సాంగ్ రీ సౌండ్ తో మారు మోగిపోయింది. ఈ పాట మాత్రమే కాదు.. ఈసినిమాలో దూంధాం.. దోస్తాన్ సాంగ్ కూడా.. సూపర్ హిట్ అయ్యింది.రెండు కోట్లకు పైగా ప్యూస్ తో దూసుకుపోయింది.

ఇక అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి.. సూపర్ హిట్ అయిన సాంగ్ లింగిడి లింగిడి లింగిడి పాట. కోట బొమ్మాళి అనే సినిమాలో పాట. ఈ పాటను వాడుకుని యూట్యూబర్లు, రీల్స్ చేసేవారు పండగ చేసుకున్నారు. డాన్స్ రాని వారిచేత కూడా స్టెప్పులేచించింది సాంగ్.

ఇవే కాదు.. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ కొట్టిన బలగం సినిమా నుంచి కూడా మూడు పాటలుసూపర్ హిట్అయ్యాయి. అసలు ఈసినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ ముఖ్యంగా ఊరు పల్లెటూరు పాటతో పాటు.. పొట్టిపిల్ల సాంగ్ అందరికి ఆకట్టుకోవడంతో పాటు కోట్లలో వ్యూస్ సాధించాయి.

ఇవే కాదు జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్య పాటతో పాటు.. వారసడు సినిమాలో రంజితే పాట కూడా సంగీత ప్రియులను అలరించాయి. ఇలా ఈ ఏడు సూపర్ హిట్ సాంగ్స్ అలరించాయి.

