Asianet News TeluguAsianet News Telugu

'మంజుమ్మల్ బాయ్స్' తెలుగు OTT..మైత్రికి ఇది ఇంకో దెబ్బా?

తెలుగులో ఇంకా పూర్తిగా ఈ సినిమా తన విశ్వరూపం చూపించలేదు. ఈ లోగా ఓటిిటి రిలీజ్ డేట్ అంటున్నారు. 

Super Hit Manjummel Boys Telugu OTT release jsp
Author
First Published Apr 12, 2024, 6:28 AM IST


 ఈ మధ్య కాలంలో మ‌ల‌యాళంలో  బ్లాక్‌బ‌స్ట‌ర్   అయిన చిత్రం మంజుమ్మ‌ల్ బాయ్స్ . రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.250కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి కొత్త రికార్డులు నెల‌కొల్పింది. దీంతో ఇప్పుడా సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ఈ సినిమా అక్కడ స్దాయిలో వర్కవుట్ కాలేదు కానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగానే నచ్చిందని చెప్పాలి. భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టకపోయినా మంచి కలెక్షన్స్ తోనే థియేటర్స్ నిండుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

 హిట్ టాక్ తెచ్చుకున్న 'మంజుమ్మల్ బాయ్స్' ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్  సొంతం చేసుకుంది. మే 3న దక్షిణాదిలో భాషల్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఇంకా పూర్తిగా ఈ సినిమా తన విశ్వరూపం చూపించలేదు. పీవీపి మల్టిఫ్లెక్స్ సమస్య తో మల్టిప్లెక్స్  షోలు ఆగిపోయాయి. వచ్చే వారం స్టార్స్ తో ప్రమోషన్ చేయిద్దామనే ఆలోచనలో మైత్రీ మూవీస్ ఉన్నట్లు సమాచారం. దాని ఇంపాక్ట్ తో కలెక్షన్స్ అందుకునే సమయానికి ఓటిటిలోకి వచ్చేస్తే కష్టం కదా. చూడాలి మరి ఏం జరగనుందో.

కథ విషయానికొస్తే.. మంజుమ్మల్ అనే ఊరికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ తమిళనాడులోని కొడైకెనాల్ ట్రిప్ కి వెళ్తారు. వీళ్లలో ఒకడు లోతైన గుహలో పడిపోతాడు. ఇతడిని మిగతా స్నేహితులు అందరూ కలిసి ఎలా రక్షించారు? చివరకు ఏమైందనేదే 'మంజుమ్మల్ బాయ్స్' స్టోరీ. ఇది య‌థార్థ క‌థ‌. 2006లో గుణ కేవ్స్‌లో చిక్కుకున్న త‌న మిత్రుడ్ని ర‌క్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మ‌ల్ బాయ్స్ చేసిన సాహ‌సానికి తెర రూప‌మే ఈ చిత్రం. దీన్ని ద‌ర్శ‌కుడు చిదంబ‌రం ఎంతో నిజాయితీగా స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా తెర‌పై చూపించ‌గ‌లిగాడు. 

 సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌లో.. ఆ క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నామేమో అని ప్రేక్ష‌కుల‌కు అనిపించేలా క‌థ‌ని ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించాడు.  పెద్ద‌గా డ్రామా, మలుపులు లేకున్నా మంజుమ్మ‌ల్ గ్యాంగ్ అల్ల‌రి బాగానే కాల‌క్షేపం చేయిస్తుంది. వీళ్లు ఎప్పుడైతే గుణ కేవ్స్ చూడాల‌ని నిర్ణ‌యించుకుంటారో అక్క‌డే క‌థ మ‌లుపు తిరుగుతుంది.  ఇక సుభాష్ డెవిల్స్ కిచెన్‌లో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఒక్క‌సారిగా ఉత్కంఠ‌భ‌రితంగా మారిపోతుంది. అక్క‌డి నుంచి చివ‌రి వ‌ర‌కు సుభాష్‌ను ఎలా బ‌య‌ట‌కు తీసుకొస్తారా? అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్ని తొలిచేస్తుంటుంది. ద్వితీయార్ధ‌మంతా ఈ స‌ర్వైవ‌ల్ డ్రామాతోనే ముందుకు సాగుతుంది.

 మలయాళంలో ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ ను అల్లాడించాయి.   మంజుమ్మెల్ బాయ్స్ సినిమా అయితే రెస్పాన్స్ మామూలుగా లేదు. కేవలం కేరళలో మాత్రమే కాకుండా తమిళ  ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. షోబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసిల్, బాలు వర్ఘీస్ తదితరులు నటించిన ఈ చిత్రం మళయాళ బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో పాటు మాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios