బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ 30'. బీహార్ కి చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ స్థాపించిన 'సూపర్ 30' అనే ఐఐటీ శిక్షణ సంస్థ నేపధ్యంలో ఈ సినిమాను దర్శకుడు వికాస్ బెహెల్ తెరకెక్కించారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హృతిక్ రోషన్.. ఆనంద్ కుమార్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ను ఓ విద్యా సంస్థ ఐఐటీ ప్రొఫెసర్ గా నియమిస్తుంది. కానీ విద్యపేరుతో డబ్బు దండుకుంటున్నారని అతడు ఉద్యోగం మానేసి సొంతంగా కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తారు.

ప్రతీ ఏడాది 30 మంది ఉత్తమ విద్యార్ధులకు ఉచితంగా ఐఐటీలో కోచింగ్ ఇస్తుంటారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కింది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది.

ఇందులో హృతిక్ లుక్ కొత్తగా ఉంది. ఈ సినిమాతో ఆయన కచ్చితంగా సక్సెస్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.